అమరావతి పర్యటన వేళ మోదీ ఊహించని వరం..!?
అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ ఏపీ పర్యటన వేళ భారీ అంచనాలు ఉన్నాయి. కేంద్రం - ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తరువాత రాజధాని కోసం పలు నిర్ణయాలు జరిగాయి. కేంద్రం ప్రపంచ బ్యాంకు రుణంతో పాటుగా ఇతర ప్రాజెక్టులను కేటాయించింది. ఇప్పుడు పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని అమరావతికి వస్తున్నారు. కాగా, ఈ వేళ ఏపీ ప్రభుత్వం నుంచి ప్రధానికి పలు వినతులు అందుతున్నాయి. ప్రధాని అమరావతి వేదికగా కీలక ప్రకటన ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
అమరావతి కేంద్రంగా
పహల్గాం ఉగ్ర దాడి తరువాత ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు.. సైనిక అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ క్షణమైనా ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఇదే సమయంలో ఏపీలో ప్రధాని పర్యటన ఖాయమైంది. మే 2న ప్రధాని మోదీ అమరావతి షెడ్యూల్ ఖరారు చేసారు. ప్రధాని పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. స్వాగత ఏర్పాట్ల నుంచి బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. లక్షలాది మందితో సభ ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రధాని అమరావతి కేంద్రంగా చేసే ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది.

ప్రధాని పై ఆశలు
2015 లో అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. ఆ తరువాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో అమరావతి అంశం వివాదంగా మారింది. ఇప్పుడు తిరిగి ఏపీలో అమరావతి పనులు ప్రారంభోత్సవం కోసం చంద్రబాబు ఆహ్వానం మేరకు ప్రధాని అమరావతి వస్తున్నారు. నాడు అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో ప్రధాని పార్లమెంట్ మట్టి.. పుణ్య నదుల నీరు తెచ్చారు. రాజకీయంగానూ ఆ తరువాత వీటి పైన భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా, ఇప్పుడు అమరావతి కోసం కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణంతో పాటుగా అమరావతికి రైల్వే ప్రాజెక్టు, రింగ్ రోడ్ నిర్మాణం వంటి వాటికి ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో అమరావతికి చట్ట బద్దత అంశం ఇప్పుడు రైతుల్లో.. ప్రభుత్వంలో చర్చ సాగుతోంది.
ప్రధాని ప్రకటన పై
ఇక, ఏపీ కి చెందిన కొంత మంది బీజేపీ నాయకులు అమరావతికి రెండవ సారి మోడీ ని పిలవటం సరికాదు అనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే.. ముఖ్యమంత్రి అభ్యర్ధన మేరకు ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని రాక వేళ పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఏపీకి అమరావతి రాజధానిగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా మార టంతో.. ఇప్పుడు ప్రధాని మోదీని బహిరంగ సభ వేదిక పైన నుంచి చంద్రబాబు మరి కొన్ని అంశాల పైన మద్దతు కోరేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ సైతం అమరావతి కోసం భారీ వరం ప్రకటించే అవకాశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. మరి.. మోదీ అమరావతి కేంద్రంగా ఏదైనా ప్రకటన చేస్తారా.. ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications