అదొక్కటే కాదు, మరో కోణం: పవన్ కళ్యాణ్‌పై మోడీ ఆగ్రహం వెనుక, అవసరమే కానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోడీ లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో, టాలీవుడ్‌లో ఇది చర్చకు దారి తీస్తోంది.

బాబుకు తమిళనాడు ఝలక్: ఎక్కడిదాకైనా రెడీ.. ఇక జగన్ పక్కా ప్లాన్

సినీ ప్రముఖులు మోహన్ లాల్, అనుష్క శర్మ, అనిల్ కపూర్‌లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, మోహన్ బాబులకు సోమవారం ప్రధాని మోడీ లేఖలు రాశారు. కానీ 2014లో తమకు మద్దతిచ్చిన పవన్‌కు రాయలేదు.

2014లో మద్దతిచ్చినా..

2014లో మద్దతిచ్చినా..

2014లో బిజెపి-టిడిపి కూటమికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశం నేపథ్యంలో బిజెపితో విబేధిస్తున్నారు. హోదా గురించి పలు సందర్భాల్లో కమలం పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీని నేరుగా ప్రశ్నించారు.

హోదానే కారణం కాదు.. పవన్ కళ్యాణ్ డైలమా

హోదానే కారణం కాదు.. పవన్ కళ్యాణ్ డైలమా

ప్రధాని మోడీ జనసేన అధినేతకు లేఖ రాయకపోవడానికి హోదా ఒక్కటే కారణం కాదని అంటున్నారు. 2019 ఎన్నికలకు ఎవరితో వెళ్లాలనే అంశంలో పవన్ ఇంకా తేల్చుకోకపోవడమే మోడీ లేదా బిజెపి దూరం పెట్టడానికి కారణమని అంటున్నారు. ఆయన డైలమాలో ఉన్నారని బిజెపి నేతలు భావిస్తున్నారు.

మోడీ, బిజెపి పెద్దల ఆగ్రహం వెనుక

మోడీ, బిజెపి పెద్దల ఆగ్రహం వెనుక

2019 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని ఏపీ బిజెపి నేతలు బిజెపి అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించడం పక్కన పెడితే.. లెఫ్ట్ పార్టీతో వెళ్లనున్నారనే విషయమే బిజెపి పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. అయితే పవన్ ఎవరితో వెళ్తారనే విషయం ఇంకా తేలలేదు.

ఏపీ బిజెపి దూరం జరగొద్దనుకుంటోంది, అదే సమయంలో

ఏపీ బిజెపి దూరం జరగొద్దనుకుంటోంది, అదే సమయంలో

ఏపీ బిజెపి నేతలు సాధ్యమైనంత వరకు జనసేనానికి దూరం జరగవద్దని భావిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అర్థం చేసుకోకుండా దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం తాడేపోడో తేల్చుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి మౌనంగా ఉండటం మంచిదని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అవసరమే కానీ

పవన్ కళ్యాణ్ అవసరమే కానీ

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అవసరమేనని, కానీ లెఫ్ట్‌తో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ, అందుకోసం బిజెపిని టార్గెట్ చేసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని అంటున్నారు. పవన్ వస్తే సరే.. లేదంటే ఆయన లేకున్నా పర్వాలేదన్నట్లుగా ఉంది. అందుకే వ్యూహాత్మకంగా మోడీ లేఖ నుంచే ఆయనను దూరం పెట్టినట్లుగా భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Modi has written letters to celebrities of different sectors to take part in Swachh Bharat Abhiyan as a part of which he wrote letters Anil Kapoor, Anushka Sharma, Mohan Lal, SS Rajamouli, Mohan Babu, Young Rebel star Prabhas and Mahesh Babu except Pawan Kalyan. Pawan Kalyan is very close to Modi and his not writing letter to PK has become the hot topic of discussion in T- Town. BJP leaders are saying that Modi did not send him letter as he didn't take a clear stand so far.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి