ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యం కావాలి: మోడీ
న్యూఢిల్లీ: ప్రధానిగా భారత, ప్రపంచ పౌరులకు నరేంద్ర మోడీ తొలి సందేశం ఇచ్చారు. అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకోవడానికి ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. ప్రజల మద్దతును, ఆశీస్సులను, చురుకైన పాత్రను కోరుతున్నానని, మనం కలిసికట్టుగా భారత అద్బుత విజయానికి బాటలు వేద్దామని ఆయన అన్నారు.
మోడీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన సందేశంతో వెబ్‌సైట్‌లో చోటు చేసుకుంది. శక్తివంతమైన, అభివృద్ధికరమైన భారత నిర్మాణం కోసం కలలు కని సాధించుకుందామని, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి మన వంతు కృషి చేద్దామని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో సంబంధాలు కొనసాగించడానికి సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా శక్తి పనికి వస్తుందని తాను గట్టిగా నమ్ముతానని ఆయన అన్నారు. ఈ వేదిక వినడానికి, నేర్చుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
తమ సమచారాన్ని పిఎంవో వైబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని, పిఎంవో వెబ్‌సైట్ నేరుగా ప్రజలతో సంభాషించే సాధనమని ఆయన అన్నారు. అభివృద్ధి, సుస్థిరత, సుపరిపాలనలకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications