సీమాంధ్రులంతా గెస్ట్ ఆర్టిస్టులే: పోచారం, మాఫీపై క్లారిటీ

Pocharam says Seemandhra people are guest artists
హైదరాబాద్: సీమాంధ్రులు హైదరాబాదులో ఉండేది తాత్కాలికమేనని, వారంతా గెస్టు ఆర్టిస్టులేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సచివాలయంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన సంఘటనపై ఆయన శనివారం మీడియా సమావేశంలో ఆ విధంగా ప్రతిస్పందించారు.

తెలంగాణలో రుణాల మాఫీపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో రుణమాఫీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 2008 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అయ్యాయని, 2008 తర్వాత తీసుకున్న పంట రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసిందని, బ్యాంకుల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఎల్లుండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు.

రుణమాఫీపై మంత్రి వర్గ సమావేసంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోచారం చెప్పారు. ఇదిలావుంటే, బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+