వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ఎఫెక్ట్: టీకి అని కొందరు, ఏపికని మరికొందరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్లమెంటులో పోలవరం బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిసే ముంపు ప్రాంతాల్లోని కొంతమంది ఉపాధ్యాయులు తెలంగాణలోనే ఉంటామంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారట. ఇంకొంతమంది ఏపీకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకోనురని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్ కింద ఉన్న వివిధ విద్యాసంస్థల భవిష్యత్తు పైన నిర్ణయ ప్రక్రియ మరికొద్ది రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Polavaram bill effect on Khammam teachers

మంగళవారం వీటిపై చర్చించి కొన్నింటి విషయంలో ఒక నిర్ణయానికి రావాలని రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులు భావించారు. అయితే, ఈ లోపు ఏపీ విద్యాశాఖ కార్యదర్శి బదలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా మరొకరు బాధ్యతలు చేపట్టారు. దీంతో మరికొద్ది రోజులు వాయిదా పడిందని అంటున్నారు.

మరోవైపు, తెలంగాణలో ఉన్న సంస్థళన్నీ తెలంగాణ ముద్రతో మార్చిన నియమ నిబంధనల పత్రాలను విద్యాశాఖకు సమర్పించాయి. వీటిని ఒక్కటొక్కటిగా పరిశీలించి కార్యదర్శులిద్దరూ తేలుస్తారు. పరస్పర అంగీకారం కుదిరినవి విడిపోతాయి. లేనివాటికి సంబంధించి రెండు రాష్ట్ర్లాల మధ్య ఎంవోయు కుదుర్చుకొని సేవలు అందించాల్సి ఉంటుంది.

English summary
Polavaram bill effect on Khammam district Seven Mandal teachers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X