జగన్‌కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్
ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొంత కాలంగా వ్యక్తమవుతోన్న ఆందోళనలు, భయాలు నిజమయ్యాయి. సవరించిన(పెరిగిన) అంచనాలకు నిర్ద్వంద్వంగా నో చెబుతూ జగన్ సర్కారుకు కేంద్రం భారీ షాకిచ్చింది. విభజన హామీల్లో ప్రధానమైన పోలవరం నిర్మాణ వ్యయం అంచనా ఇప్పటికే రెట్టింపుకాగా, ఆ అదనపు ఖర్చును తాము భరించలేమంటూ కేంద్రం కుండబద్దలు కొట్టింది. పాత లెక్కకు మించి ఒక్కపైసా ఇవ్వొద్దంటూ జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ ఈ మేరకు స్పష్టం చేసింది. ఇంత జరుగుతున్నా, పోలవరం జలాశయం వద్ద కొత్తగా నిర్మించి తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ సర్కారు ముందుకే పోతున్నది. వివరాల్లోకి వెళితే..

పైసా కూడా ఇవ్వొద్దు..
విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న ఏపీని ఆదుకోడానికి నాటి మన్మోహన్ సింగ్ సర్కారు ఏపీకి భారీగా హామీలివ్వడం, అందులో అతి ప్రధానమైన పోలవరం ప్రాజెక్టును తామే నిర్మించి ఇస్తామని వాగ్ధానం చేయడం, 2014 ఎన్నికల్లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రాజెక్టును తామే చేపడతామని రాష్ట్ర సర్కారు ముందుకు రావడం, విభజన జరిగి ఏడేళ్లయినా పోలవరం పూర్తికాకపోవడం తెలిసిందే.
ఈలోపు ఖర్చులన్నీ పెరిగి, ప్రాజెక్టు అంచనా వ్యయం కాస్తా రెట్టింపైంది. చివరిసారిగా 2017లో ఆమోదించిన మొత్తాన్నే ఇస్తామని కేంద్రం చెబుతుండగా, పెరిగిన వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరించాలంటూ జగన్ సర్కారు రెండేళ్లుగా కేంద్రాన్ని వేడుకుంటోంది. అందుకు కేంద్రం ఓకే చెప్పిందంటూ తరచూ వైసీపీ నేతలు ప్రకటలు చేస్తున్నా, వాస్తవంలో మాత్రం ఖర్చును భరించడానికి సిద్ధంగా లేమని కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. పాత అంచనాలకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వొద్దంటూ జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

పోలవరానికి 20,398 కోట్లే
ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.55,656.87 కోట్ల అవసరమంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తుది అంచనా వ్యయం ప్రతిపాదనల్ని కేంద్రం దాదాపు తిరస్కరించింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దంటూ కేంద్ర జల వనరులశాఖకు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకు పాత మొత్తానికే(20వేల కోట్లకే) పరిమితం కావాలని తేల్చి చెప్పింది. పోలవరం హెడ్ వర్క్స్, భూమి, సహాయ పునరావాసానికి నిర్దేశించిన మొత్తాలను 2017లో ఖరారైన మొత్తాలను దాటి ఇవ్వకూడదని జలశక్తిశాఖకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

సీడబ్ల్యూసీ ఓకే చెప్పినా..
నిజానికి పోలవరం ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అంగీకారం తెపింది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) పేర్కొనగా, రూ.47,725.74 కోట్లుగా తుది అంచనాల సవరణ కమిటీ 2017లో నిర్ధారించాయి. కానీ కేంద్రం మాత్రం వాటిని అధికారికంగా గుర్తించలేదు. తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌లకు సీఎం జగన్ పలు దఫాలుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పాత లెక్కల ప్రకారమే ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు రూ.5,035.05 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.7,278.85 కోట్లు, హెడ్‌వర్క్స్‌కు రూ.8,818.21 కోట్లు, కుడి ప్రధాన కాలువ రూ.1,885.43 కోట్లు, ఎడమ ప్రధాన కాలువ రూ.2,373.07 కోట్లకే పరిమితం కావాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను కేంద్ర జలశక్తిశాఖ ఆదేశించింది.

ఏపీ సర్కారులో ఆందోళన
కేంద్ర జలసంఘం అంచనా మేరకు భూ సేకరణ వ్యయం రూ.13,077.15 కోట్లు, పునరావాసానికి ఖర్చు రూ.20,091.09 కోట్లుగా ఉంది. అదేవిధంగా కేంద్ర జలశక్తి, కేంద్ర ఆర్థికశాఖతో కూడిన తుది అంచనా వ్యయ కమిటీ భూ సేకరణకు రూ.10,199.67 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.17,972.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ఈ అంచనాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం చేస్తున్న ఖర్చులు చెల్లించాలంటూ పీపీఏకు ఏపీ జల వనరుల శాఖ బిల్లులు పంపుతుండగా, అవి కేంద్ర కేబినెట్ ఆమోదించిన(2017నాటి) అంచనా మొత్తాని లోబడి ఉన్నాయా, లేవా అని పీపీఏ వడగడుతోంది. దీంతో పూర్తయిన పనులకు కూడా నెలల తరబడి బిల్లులు ఆమోదించడం లేదని సమాచారం. పోలవరానికి నిధుల విషయంలో కేంద్రం తన పాత వైఖరికే కట్టుబడి ఉండటం ఏపీ జల వనరుల శాఖను ఆందోళనకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,

పోలవరం వద్ద కొత్త లిఫ్ట్ ప్రాజెక్ట్
కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెలువరించిన కట్టడి ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టుకు అదనపు(పెరిగిన) నిధులు రాబోవని స్పష్టంగా తెలుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పోలవరం జలాశయంవద్ద కొత్తగా ఏర్పాటు చేయదలచిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు త్వరలోనే ఆమోద ముద్ర పడనుంది. ఏపీ జల వనరులశాఖ పర్యవేక్షణ విభాగం ఈ ప్రతిపాదనలను పరిశీలించి ఆర్థికశాఖకు పంపగా, అక్కడా పరిశీలన పూర్తయిందని, కొన్ని నిబంధనలకు మినహాయింపు ఇస్తూ ఫైలుకు అనుమతిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం జగన్ కార్యాలయానికి చేరింది. దాదాపు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతోన్న ఈ ప్రాజెక్టు ద్వారా..

జులైలోగా పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్..
ఓవైపు పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా, ఏపీ సర్కారు తలపెట్టిన కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ఆఘమేఘాల మీద పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది జులై నాటికి లిఫ్ట్ ప్రాజెక్ట్ ప్రాథమిక పనుల పూర్తి చేయాలనే యోచనలో జలవనరుల శాఖ ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మించాక జలాశయంలో కనీస నీటిమట్టం దిగువన ఉన్న నీటినీ వినియోగించుకునేందుకు వీలుగా ఈ ఎత్తిపోతలను తలపెట్టారు.
కృష్ణా డెల్టాలో వేసవి తాగునీటికి, ఇతరత్రా అవసరాలకు ఈ ఎత్తిపోతల ద్వారా 20 టీఎంసీల వరకు మళ్లించేందుకు వీలుగా దీన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. పోలవరం లో మొత్తం 194.5 టీఎంసీల నీటిని నిల్వ చేసినా డెడ్ స్టోరేజీగా 120 టీఎంసీలు ఉంటాయి. 35.5 మీటర్ల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా పంపుహౌస్ నిర్మిస్తారు. 35.5 మీటర్ల నుంచి 31.1 మీటర్ల మధ్య ఉన్న నీటిని ఎత్తిపోసి పోలవరం కుడి కాలువ ద్వారా మళ్లించేలా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications