బడ్జెట్ కు ముందే ఏపీకి కేంద్రం భారీ వరం, కీలక మలుపు..!!
ఏపీకి కేంద్రం భారీ వరం ప్రకటించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి కొంత కాలంగా తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్దికంగా తోడ్పాటు అందిస్తోంది. అమరావతి.. పోలవరం విషయంలో ఏపీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తోంది. అందులో భాగంగా కేంద్రం ఈ రోజు ప్రవేశ పెట్టే బడ్జెట్ వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం భారీ గా నిధుల కేటాయింపుకు ఆమోదం లభించింది. దీంతో, నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం సహకరించనుంది.
బడ్జెట్ కు ముందే కేంద్రం ఏపీకి మరో వరం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం అత్యం త ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.ఇటీవల అమరావతిలో 14 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరా తీశారు. అప్పటి షెడ్యూల్‌ను బట్టి 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే..గోదావరి పుష్కరాల నాటికే పోలవరాన్ని పూర్తి చేయాలని సీఎంకు నిర్మల సూచించారు.

దీంతో.. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలంటూ జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు చంద్రబాబు నిర్దేశించారు. గత నెల పోలవరం ప్రాజెక్టు క్షేత్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు, కీలకమైన డయాఫ్రమ్ వాల్ ఫిబ్రవరి నెలాఖరునాటికి పూర్తవుతుందని ..గ్యాప్ -1, గ్యాప్-2 పనులు సహా డయాఫ్రమ్‌వాల్‌పై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయగలమని కాంట్రాక్టు సంస్థ తెలిపింది.
కేంద్ర నిధులు మంజూరు
కాగా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో ఎలాంటి అవరోధాలు రానివ్వబోమని రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టంచేసింది. అందులో భాగంగా తాజాగా జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి కాంతారావును ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ కలిశారు. మూడో విడత కింద రూ. 3,000 కోట్లు ఇవ్వాలని కాంతారావును రొనాల్డ్ రోస్ కోరారు. ఈ నిధులు మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంతారావు వివరించారు. చెరో రూ.1,500కోట్లు చొప్పున రూ.3,000 కోట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనుల తీరుపై నరసింహమూర్తిని కాంతారావు ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది మార్చి లేదా జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తంచేశారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ డిజైన్లను కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉం దని నరసింహమూర్తి వివరించారు. దీంతో .. నిధుల విడుదలతో సహా డిజైన్లను కూడా వీలైనంత వేగంగా ఆమోదం తెలుపుతామని వెల్లడించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications