వందేళ్లైనా పోలవరం పూర్తి కాదు: బలరాం నాయక్
వరంగల్: గోదావరి నదిపై సీమాంధ్రలో తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో వందేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని ఆయన సోమవారం వరంగల్‌లో అన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు పొత్తుల కోసం కాంగ్రెసు వెంపర్లాడడం లేదని ఆయన అన్నారు.
ఎన్నికల పొత్తులపై తమ పార్టీ తొందర పడడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరస) నేత వినోద్ అన్నారు. సిపిఐ కూడా తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వలసలతో కొంత ఇబ్బంది ఉంటుందని, అలాంటి నేతలతో తమ పార్టీ అధ్యక్షుడు చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుతో పొ్త ులేకుండా అధికారంలోకి వస్తామా లేదా రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి ఏైనా నష్టం జరుగుతుందా అనేది కెసిఆర్ ఇప్పటికై పార్టీ ముఖ్యులతో జిల్లా స్థాయి నేతల నుంచి సమాచారం తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications