Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సబ్ కలెక్టర్ ఆఫీసు ఎఫెక్ట్, చంద్రబాబు దెబ్బతో ఫోన్ కాల్ డేటా బయటకు, కంప్యూటర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనంత సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె (ఉమ్మడి చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నాడు సీఎస్, డీజీపీ, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు నాయకుడు అత్యవసర సమావేశం చేపట్టి వివరాలు తెలుసుకున్నారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై అన్నమయ్య జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మదనపల్లె డీఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం రావడంతో సీఎం చంద్రబాబు నాయడు పూర్తి సమాచారం సేకరించాలని సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో అసైన్డ్, 22 ఏ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు అయినట్లు తెలుస్తోంది.

Police are taking call data in the area around Madanapalle sub collector office

ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం రాత్రి 11. 24 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై అన్నమయ్య జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయంపై ఆరా తీశారు. గౌతమ్ తేజ అలియాస్ గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నట్లు వెలుగు చూసింది.

ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒంటరిగా ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. కంప్యూటర్ రూమ్ క్లర్క్ గా పని చేసే గౌతమ్ తేజ ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనే వివరాలను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను అడిగారు. ఘటనా సమయంలో విధుల్లో వీఆర్ఏ ఉన్నాడని సంబంధిత అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారని తెలిసింది.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా?, పోలీసులు ఎన్ని గంటలకు అక్కడికి చేరుకున్నారు, అగ్నిమాపక సిబ్బంది ఎంత సమయానికి వెళ్లారు, గతంలో మదనపల్లెలో ఆర్డీఓగా పని చేసిన మురళి ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడా?, ఏ పని మీద మరళి అక్కడికి వెళ్లాడు, సోమవారం ఉదయం నుంచి ఏం విచారణ చేశారు అని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు అడిగారని తెలిసింది.

Police are taking call data in the area around Madanapalle sub collector office

ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ప్రశ్నించారని తెలిసింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె డీఎస్పీకి, సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఎవరెవరు మాట్లాడారు, ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి సోమవారం వేకువ జామున వరకు సబ్ కలెక్టర్ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఫోన్లలో మాట్లాడారు అని సమాచారం తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాంతరాజ్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డాటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు గుర్తు చేశారని తెలిసింది. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మరిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను ఆదేశించారని సమాచారం. అలాగే ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న సబ్ కలెక్టర్ ఆఫీసు ఉద్యోగి గౌతమ్ తేజ నెల రోజుల కాల్ డేటా సేకరించాలని పోలీసు అధికారులు సిద్దం అయ్యారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+