విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుద్దా వెంకన్న అరెస్ట్ : కొడాలి నాని - డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు : టీడీపీ ఆందోళన..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసారు. బుద్దా వెంకన్న మంత్రి కొడాలి నాని తో పాటుగా డీజీపీ సవాంగ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన పోలీసులు చర్యలు తీసుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్నాహ్నమే బుద్దా వెంకన్న నివాసానికి విజయవాడ టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. ఆయను ను స్టేషన్ ను రావాలని..స్టేట్ మెంట్ తీసుకొని పంపిస్తామని చెప్పారు. అయితే, టీడీపీ నేతలు అందుకు అంగీరించలేదు. ముందుగా 41 ఏ నోటీసులు జారీ చేస్తే..తమకు స్టేషన్ కు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వటానికి అభ్యంతరం లేదని చెప్పారు.

డీజీపీపైన బుద్దా అనుచిత వ్యాఖ్యలు

డీజీపీపైన బుద్దా అనుచిత వ్యాఖ్యలు

ఇదే సమయంలో అటు టీడీపీ నేతలు..ఇటు పోలీసులు పెద్ద ఎత్తున బుద్దా వెంకన్న నివాసానికి చేరుకున్నారు. పోలీసులు బారీ బందోబస్తు మధ్య బుద్దా వెంకన్నను టూ టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు ఇంటి గేటును టచ్ చేస్తే...ప్రాణాలతో తిరిగి వెళ్లవంటూ బుద్దా వెంకన్న హెచ్చరించారు. అదే విధంగా గుడివాడలో క్యేసినో నిర్వహణ పైన అనేక ఆరోపణలు చేసారు. అందులో డీజీపీకి సైతం వాటా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

బుద్దా వ్యాఖ్యలతో కలకలం

బుద్దా వ్యాఖ్యలతో కలకలం

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుద్దా వెంకన్న నివాసానికి చేరుకున్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ చేసారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన వెంటనే అరగంటలో కొడాలి నానిని ఏం చేస్తారో చూడాలంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ తరువాత మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటే పదే పదే అవే వ్యాఖ్యలను రిపీట్ చేసారు. అయితే, టీడీపీ నేతలు భిన్నంగా వాదిస్తున్నారు.

టీడీపీ శ్రేణుల ఆందోళన

టీడీపీ శ్రేణుల ఆందోళన

అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న చేసింది తప్పు అయితే, అదే విధంగా చంద్రబాబు పైన తీవ్ర పరుష పద జాలంతో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని చేసింది తప్పు కాదా..ఆయన్ను అరెస్ట్ చేయరా అంటూ కొందరు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న అరెస్ట్ సమయంలో ప్రశ్నిస్తున్నారు. ఇక, ఇప్పుడు బుద్దా వెంకన్నను స్టేషన్ ను తీసుకెళ్లిన పోలీసులు...స్టేట్ మెంట్ తీసుకొని వదిలేస్తారా లేక కేసు నమోదు చేసి అరెస్ట్ చూపిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

English summary
TDP Leader Budha Venkanna Arrest against un parliamentary comments against Kodali Nani and DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X