ఇక మొదలు - వైసీపీ ముఖ్యనేత అరెస్ట్..!!

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన ఆచూకి గుర్తించారు. అందులో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి.

సురేశ్ అరెస్ట్
వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఈ అరెస్ట్ జరిగింది. సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకుని హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. సురేష్‌ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు.

Police Arrest YSRCP Former MP Nandigam Suresh in TDP office attack case

టీడీపీ కార్యాలయంపై దాడి
సురేశ్ ను ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. హైకోర్టు బెయిల్ పిటీషన్ కొట్టేయటంతో అరెస్ట్ భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు సురేష్‌ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది.

ఇతర నేతలకు ఉచ్చు
తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్​ను అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే కేసులో మరి కొంత మంది వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు. వారి విషయంలోనూ ఇప్పుడు విచారణ అధికారులు తీసుకొనే నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+