భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు (పిక్చర్స్)

విశాఖపట్నం: మద్యానికి, చెడు అలవాట్లకు బానిసై నగరంలో దొంగతనాలు చేస్తున్న పాత నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఈ ఇద్దరు నేరస్తులను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 3 కిలోల 305 గ్రాముల వెండి ఆభరణాలు, 26 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్ టాప్, కలర్ టివీ, బజాజ్ సీటీ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నగర్ క్రైమ్ ఏడీసీపీ ఎస్.వరదరాజు మీడియా సమావేశంలో తెలిపారు.

పాత నేరస్తులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సంజయ్ నగర్ కొత్తపాకల ప్రాంతానికి చెందిన కోరంగి శ్రీను, వలసపాకలకు చెందిన పితాని రవిశంకర్ గతంలో పలు చోరీ కేసుల్లో జైలు జీవితం అనుభవించారన్నారు. ఇద్దరూ కలిసి పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరధిలో రెండు, నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరికి పాల్పడ్డారు.

నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డి.కృష్ణ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పోయిందని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరిద్దరిని మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపగా వారు గతంలో చేసిన చోరీల విషయాలు తెలిశాయన్నారు.

నిందితుల్లో కోరంగి శ్రీనుపై హత్యాయత్నం కేసు ఉంది. ఆతను గతంలో పలు దొంగతనాలకు కూడా పాల్పడ్డాడు. మరో నిందితుడు రవిశంకర్‌పై చోరీ కేసులున్నాయి. వీరిద్దరికీ 2013లో కాకినాడ సబ్ జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడ్డారని క్రైమ్ ఏడీసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్ స్పెక్టర్ రఘ శ్రీనివాస్, పీఎం పాలెం ఎస్‌ఐ పి. రామకృష్ణ, పరవాడ ఎస్ఐ గోవిందరావు తదితరులు పాల్గోన్నారు.

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఈ ఇద్దరు నేరస్తులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 కిలోల 305 గ్రాముల వెండి ఆభరణాలు, 26 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్ టాప్, కలర్ టివీ, బజాజ్ సీటీ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

నగర్ క్రైమ్ ఏడీసీపీ ఎస్.వరదరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డి.కృష్ణ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పోయిందని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరిద్దరిని మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపగా వారు గతంలో చేసిన చోరీల విషయాలు తెలిశాయన్నారు.

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్ స్పెక్టర్ రఘ శ్రీనివాస్, పీఎం పాలెం ఎస్‌ఐ పి. రామకృష్ణ, పరవాడ ఎస్ఐ గోవిందరావు తదితరులు పాల్గోన్నారు.

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

భారీగా గోల్డ్ స్వాధీనం, నేరస్తులు అరెస్టు

ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఈ ఇద్దరు నేరస్తులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 కిలోల 305 గ్రాముల వెండి ఆభరణాలు, 26 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+