వ్యభిచార గృహంపై దాడి: నిర్వాహకుడు, మహిళల అరెస్ట్

దీంతో ఆదివారం మధ్యాహ్నం ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలోని బృందం వ్యభిచార గృహంపై దాడి చేసి విజయవాడకు చెందిన నిర్వాహకుడు చందూతో పాటు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.
120కిలోల గంజాయి సీజ్: నలగురి అరెస్ట్
రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన నలుగుర్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి రూ. 3.50లక్షల విలువ చేసే 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే డిఎస్పీ మురళీధర్, ఇన్ స్పెక్టర్ అంబటి అంజనేయులు డిఎస్పీ ఆఫీసులో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన కుంజు బిహారీ మహాపాత్రో(37), ప్రేమ్‌కుమార్(24), హేమంత్ బిహారీ(24), చమంత్ పాణి(24)లు గత రెండేళ్లుగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్, ముంబై, పుణెలతోపాటు వివిధ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్-కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు.
ఏసీలో బోగీలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులపై అనుమానం వచ్చి పరిశీలించగా వారి వద్ద రూ. 3.50లక్షల విలువైన 120 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయిని సూట్ కేసుల్లో నింపుకుని ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ నలుగురికి ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున ఇచ్చి పుణెలోని వ్యక్తులకు అందజేసేలా ఒడిశాకు చెందిన ఆసిస్ నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుసుకున్నారు. ఆసిస్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications