వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఆర్పీ నుండి ఓడి జగన్ వైపు, బలవంతంగా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను బుధవారం రాత్రి పది గంటలకు భగ్నం చేశారు. గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్‌ను పోలీసులు బలవంతంగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జగన్‌కు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీక్షలో ఫ్లూయిడ్స్ తీసుకోవాలని చేసిన సూచనను జగన్ దీక్షా శిబిరంలో నిరాకరించారు.

రాత్రి పది గంటల ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా శిబిరానికి చేరుకున్నారు. జగన్‌ను తరలించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కొడాలి నాని తదితరులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు ఆయనను బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించారు. దీక్షా శిబిరం నుంచి వైయస్ జగన్‌ను తరలించారు.

మరోవైపు జగన్‌ను బుధవారం పలువురు నేతలు కలిశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయి నాలుగేళ్ల పాటు తెరచాటుకు వెళ్లిన మహారాష్ట్ర కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ బుధవారం జగన్ పార్టీలో చేరారు. కార్యకర్తలతో కలసి లోటస్‌పాండ్‌కు వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి కూడా పార్టీలో చేరారు. మాజీ మంత్రి విశ్వరూప్ సంఘీభావం తెలిపి ఈ నెల 18వ తేదీన జగన్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అనంతపురం ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఆదినారాయణ రెడ్డి

ఆదినారాయణ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి.

అనంత

అనంత

అనంతపురం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న పోలీసులు.

ట్రీట్‌మెంట్

ట్రీట్‌మెంట్

నిమ్స్ ఆసుపత్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చికిత్స అందిస్తున్న వైద్యులు.

నిమ్స్‌కు

నిమ్స్‌కు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న పోలీసులు. అంబులెన్స్‌లోకి బలవంతంగా ఎక్కిస్తున్న దృశ్యం.

తోట చంద్రశేఖర్

తోట చంద్రశేఖర్

ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయి నాలుగేళ్ల పాటు తెరచాటుకు వెళ్లిన మహారాష్ట్ర కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ బుధవారం జగన్ పార్టీలో చేరారు.

విశ్వరూప్

విశ్వరూప్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతు తెలుపుతున్న మాజీ మంత్రి విశ్వరూప్. తాను ఈ నెల 18న జగన్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

లోటస్

లోటస్

పాండు నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.

నిమ్స్

నిమ్స్

ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.

English summary
On an indefinite hunger strike here protesting bifurcation of Andhra Pradesh, YSR Congress Party president Y S Jaganmohan Reddy was on Wednesday night evicted by police from the venue of his agitation and taken to a hospital as doctors voiced concern over his deteriorating health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X