భూ వివాదం నేపత్యంలో...బోండా ఉమ అనుచరులపై కేసు
విజయవాడ:సుబ్బరాయ నగర్ వెంచర్ భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ అనుచరులపై 420, 427, 471, 506 మరియు 34,120బి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి బోండా ఉమ అనుచరులు మాగంటి బాబు, వాసును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పీవీఎస్‌ఎస్ వర్మ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

గతంలో స్వాతంత్ర్య సమర యోధుల స్థలం కబ్జా ఆరోపణలతో ఒకసారి భూ వివాదంలో చిక్కుకున్న టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తాజాగా మరో భూవివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సుబ్బరాయనగర్ వెంచర్‌లో స్థలం ఇస్తామని చెప్పి రూ.35 లక్షలు తీసుకుని స్థలం ఇవ్వలేదని బాధితుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం నందిగామకు చెందిన బాధితుడు సుబ్రమణ్యం స్థానికుల సహాయంతో బోండా ఉమ, ఆయన అనుచరులు మాగంటి బాబు, వాసు, వర్మపై...నగర సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు బోండా ఉమ అనుచరులపై కేసు నమోదు చేశారు.
స్వతంత్ర సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు గతంలో వచ్చిన కేసులో బోండా ఉమ సతీమణిపై కూడా కేసు నమోదైన సంగతి విదితమే. ఈ వివాదానికి సంబంధించి బాధితులు సీఐడీని ఆశ్రయించారు. దర్యాఫ్తు చేపట్టిన అధికారులు ఎమ్మెల్యే భార్య సుజాతతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications