హై అలెర్ట్: హైదరాబాద్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు (పిక్చర్స్)
హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి 24 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సంఘ విద్రోహకశక్తులు, ఉగ్రవాద సంస్ధలు విధ్వంసానికి పాల్పడకుండా ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. రాజధానితోపాటు నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.
రైళ్లు, బస్‌స్టేషన్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. పాతబస్తీలో చార్మినార్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో కూడళ్ల వద్ద ఆర్‌పిఎఫ్ బలగాలను నియమించారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, విఐపిల ఇళ్ల వద్ద భద్రతను పెంచారు. మతపరమైన తగాదాల్లో పాల్గొన్న చరిత్ర ఉన్న అన్ని వర్గాలకు చెందిన వారిని గుర్తించి కదలికలపై నిఘాను పెట్టారు.
ఇటీవల రాజధానిలో ‘సిమి'కి చెందిన ఇద్దరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కవాతులను నిర్వహిస్తున్నామని పోలీసు కమిషనర్ మహేంద్రరెడ్డి తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించారు.

తనిఖీలు
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి 24 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సంఘ విద్రోహకశక్తులు, ఉగ్రవాద సంస్ధలు విధ్వంసానికి పాల్పడకుండా ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.

తనిఖీలు
రాజధానితోపాటు నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.

తనిఖీలు
రైళ్లు, బస్‌స్టేషన్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. పాతబస్తీలో చార్మినార్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో కూడళ్ల వద్ద ఆర్‌పిఎఫ్ బలగాలను నియమించారు.

తనిఖీలు
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, విఐపిల ఇళ్ల వద్ద భద్రతను పెంచారు.

తనిఖీలు
మతపరమైన తగాదాల్లో పాల్గొన్న చరిత్ర ఉన్న అన్ని వర్గాలకు చెందిన వారిని గుర్తించి కదలికలపై నిఘాను పెట్టారు.

తనిఖీలు
ఇటీవల రాజధానిలో ‘సిమి'కి చెందిన ఇద్దరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.

తనిఖీలు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కవాతులను నిర్వహిస్తున్నామని పోలీసు కమిషనర్ మహేంద్రరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications