వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: ఏపీలో తొలిరోజే కేసు.. లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించారంటూ తోట్లవల్లూరు స్టేషన్‌లో..

|
Google Oneindia TeluguNews

రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు తొలిరోజే షాక్ తగిలింది. హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన ఆయన.. దారి పొడవునా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారని, చాలా చోట్ల జనం గుమ్మికూడటం, కారు దిగి మరీ వాళ్లను పలకరించడం ద్వారా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో బాబుపై ఫిర్యాదు నమోదైంది.

చేసింది చిత్తూరు జిల్లావాసే..

చేసింది చిత్తూరు జిల్లావాసే..

చాలా కాలం తర్వాత ఏపీకి వచ్చిన చంద్రబాబు.. లాక్ డౌన్ రూల్స్ సరిగా పాటించలేదని అధికార వైసీపీ నేతలు విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఏకంగా ఏపీ హైకోర్టుకే ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మాత్రం చిత్తూరు జిల్లాకు చెందిన మొహమ్మద్ అలి అనే వ్యక్తి. ఫిర్యాదు కాపీలో తనను తాను సోషల్ వర్కర్ అని చెప్పుకున్న అలి.. సోమవారం చంద్రబాబు రాక సందర్భంగా సాక్షి టీవీలో ప్రసారమైన దృశ్యాలు, లాక్ డౌన్ నియమనిబంధనల ఆధారంగా ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేసు నమోదు?

కేసు నమోదు?

లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారంటూ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్లపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీచేసిన దరిమిలా ఇప్పుడు చంద్రబాబు వ్యవహారంలో ప్రభుత్వం ఎలా స్పందింస్తుందనేది కీలకంగా మారింది. చంద్రబాబు లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారనడానికి ఆధారాలను సమర్పిస్తూ.. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీతోపాటు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అలీ ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. ప్రధానంగా విజయవాడ సిటీలో, బాబు నివాసమైన ఉండవల్లిలో తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో గుమ్మికూడి చంద్రబాబుకు స్వాగతం పలకడాన్ని ఫిర్యాదులో తప్పుపట్టారు. కాగా, బాబుపై తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయినట్లు వార్తలు వచ్చాయి.

మహానాడుకు ముందు ఏంటిలా?

మహానాడుకు ముందు ఏంటిలా?


నిజానికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలని చంద్రబాబు భావించినా, ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లికి చేరుకున్నారు. మంగళవారం విశాఖ వెళ్లి స్టెరీన్ గ్యాస్ బాధితులను కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధ, గురువారాల్లో పార్టీ మహానాడు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్న వేళ.. లాక్ డౌన్ ఉల్లంఘ కేసు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అడుగడుగునా ఘనస్వాగతం..


రెండు నెలల తర్వాత ఏపీకి చేరుకున్న టీడీపీ చీఫ్ కు తమ్ముళ్లు అడుగడుగునా స్వాగతం పలికారు. జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌ పేట క్రాస్ రోడ్డులోని ఫుడ్‌ ప్లాజా వద్ద, ఆ తర్వాత చిల్లకల్లు టోల్‌గేట్‌ట్‌ సమీపంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్‌ రాజగోపాల్‌ ఆధ్వర్యాన ఘన స్వాగతం పలికారు. అలాగే నందిగామలో మాజీ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. 65వ నెంబరు జాతీయ రహదారిపై నందిగామ రైతుపేటలోని టిడిపి కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు బారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు తాను ప్రయాణిస్తున్న కారులో నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ ఉండవల్లిలోని స్వగృహానికి వెళ్లారు.

English summary
Thotlavalluru Police has received a complaint on tdp chief chandrababu for violation of lockdown rules while entering into andhra pradesh from hyderabad. the complaint was filed by social activist mahammad ali who belongs to chittor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X