మరో వివాదంలో జేసీ!: ఎందుకలా చేస్తున్నారు?.. డీఐజీకి ఫిర్యాదు..
అధికారులు తమకు అనుమతిలిచ్చినా.. జేసీ మాత్రం అడ్డుపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ అడ్డుపడుతుండటంతో తమ ఆశ్రమానికి నీటిని నిలిపివేశారని అన్నారు.
అనంతపురం: వివాదాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న జేసీ బ్రదర్స్.. ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టులో చేసిన రచ్చపై నిన్నటిదాకా ఆయనపై విమర్శలు వెల్లువెత్తగా.. తాజాగా ఆయన సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం పోలీసులకు ఫిర్యాదు అందింది.
తమ ఆశ్రమానికి రావాల్సిన ఇసుకను జేసీ ప్రభాకర్ రెడ్డి అన్యాయంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. శ్రీకృష్ణాశ్రమం చైర్మన్ సూర్య సోమవారం డీఐజీకి ఫిర్యాదు చేశారు. అధికారులు తమకు అనుమతిలిచ్చినా.. జేసీ మాత్రం అడ్డుపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ అడ్డుపడుతుండటంతో తమ ఆశ్రమానికి నీటిని నిలిపివేశారని అన్నారు.

తమ ఆధ్యాత్మిక సంస్థపై కక్షాపూరితంగా వ్యవహరిస్తున్న జేసీపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డీఐజీని సూర్య కోరారు. ప్రత్యర్థులపై అంతెత్తున లేచిపడే జేసీ.. దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications