నిజమే.. కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు: తేల్చిన పోలీసులు..

విజయవాడ: బెజవాడ కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజల ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాంత్రిక పూజల విషయంలో మంత్రి లోకేష్‌పై కూడా ఆరోపణలు రావడం వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. పోలీసులు సుమోటోగా నిర్వహించిన దర్యాప్తులో తాజాగా అసలు నిజాలు బయటపడ్డాయి.

Recommended Video

    దుర్గ గుడి ఘటన: ఎవరేమన్నారంటే..? మాణిక్యాల రావు రాజీనామా సస్పెన్స్ ?

    గతేడాది డిసెంబర్ 26న దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిజమేనని దర్యాప్తులో తేలింది. పూజలు నిర్వహించిన ఆమంచి సృజన్‌, ఘంటసాల పార్థసారథిల నుంచి ఈ మేరకు పోలీసులు వివరాలు రాబట్టారు. కాల్ డేటా ఆధారంగా యాలా అంశాలు కూపీ లాగినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు పూజారులతో గుడిలోని సిబ్బంది, అధికారులు ఫోన్ కాల్ సంభాషణ కొనసాగించినట్టు గుర్తించారు.

    police confirms tantrik puja performed at durga temple

    కాగా, తాంత్రిక పూజలు వెలుగుచూసిన వెంటనే ఈవో సూర్యకుమారి,ప్రధాన అర్చకుడు బదరీనాథ్ పైన వేటు పడింది. ఆరోజు 10 గంటలకు ప్రధాన అర్చకుడు అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ తాంత్రిక పూజలు జరిగాయన్న ఆరోపణలు కూడా వినిపించాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+