రహస్య విచారణ: పోలీసుల అదుపులో టీడీపీ నేత, కీలక వివరాలు రాబట్టేందుకు?

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: నెల్లూరులో సంచలనం రేకెత్తించిన క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మాఫియాలో రాజకీయ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో గతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

ఇందులో కీలక సూత్రధారులుగా ఉన్న బుకీ బాలకృష్ణ, టీడీపీ నేత పంటర్ శరత్‌చంద్ర అలియాస్‌ చరలను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరిని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వీరు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ప్రధాన బుకీ సుభాష్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసుల వేట కొనసాగుతోంది.

'తల్లి సాక్షిగా చెబుతున్నా.. వాళ్లు నమ్మితే చాలు; రాజకీయంలో 30కోట్లు లాస్'

police interrogating tdp leader sharath chandra over cricket bettings issue

ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న జాతీయ క్రికెట్ బుకీ కృష్ణసింగ్‌తోపాటు మరో 8మందిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి విచారణ పూర్తయితే తప్ప బెట్టింగ్ మాఫియాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యేలా లేవు.

బెట్టింగ్ మాఫియాతో సంబంధమున్న క్రికెట్ బుకీలందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్క బుకీ సుభాష్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. అతని కోసం రెండు నెలలుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nellore police interrogating TDP leader Sharath Chandra over cricket bettings issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి