నల్గొండ ఎన్‌కౌంటర్: కూంబింగ్‌లో 5 రాష్ట్రాల పోలీస్, స్లీపర్ సెల్స్‌పై దృష్టి

నల్గొండ/హైదరాబాద్: సిమి ఉగ్రవాదుల కోసం నల్గొండ, వరంగల్ జిల్లా అడవుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఐదు రాష్ట్రాల పోలీసులు ఈ కూంబింగులో పాలు పంచుకుంటున్నారు. తిరుమలగిరి, ఫణిగిరి, ఊటురు తదితర ప్రాంతాలలోని గుట్టలను, అర్వపల్లి పరిసరాలను పోలీసులు, గ్రేహౌండ్స్, కేందర్ బలగాలు జల్లెడ పడుతున్నాయి.

ముష్కరులను ఫైజల్ గ్యాంగులోని సిమి ఉగ్రవాదులుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మిగిలిన ముగ్గురిలో అంజద్, మెహబూబ్, ఇజాజ్‌లు ఉన్నారు. వారు ఓ ముఖ్య నేతను చంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్లో మృతి చెందిన అస్లాం, జకీర్‌లు సిమి ఉగ్రవాదులుగా ఏటీఎస్, మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఎన్ కౌంటర్ స్థలాన్ని వివిధ బృందాలు పరిశీలించాయి.

Police kumbing in Nalgonda and Warangal district

కాగా, నిందితులు ఖాండ్వా జైలు నుండి తప్పించుకొని వచ్చాక పలు రాష్ట్రాలు తిరిగినట్లుగా భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా చాదర్ ఘాట్ వద్ద మకాం వేశారని తెలుస్తోంది. పాతబస్తీ కేంద్రంగా సిమి ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే వాదనలు ఎప్పటి నుండే ఉన్న విషయం తెలిసిందే. వీరు అక్కడి నుండే కార్యకలాపాలు నిర్వహించారని తెలుస్తోంది.

పది మంది బృందంతో కూడిన మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఆదివారం నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. తొలుత అర్వపల్లి గుట్టల్లో, ఆ తర్వాత జానకిపురంలో సంఘటనా స్థలిని ఈ బృంద సభ్యులు సందర్శించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి వివరాలు సేకరించారు. అనంతరం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో ఉంచిన ఉగ్రవాదుల మృతదేహాలను పరిశీలించారు.

ఖాండ్వా జైలులో సేకరించిన సిమి ఉగ్రవాదుల వేలి ముద్రలు, ఫొటోలతో ఆనవాళ్లన సరిచూసుకుని అయూబ్‌, జకీర్‌లు ఆ ముఠా సభ్యులేనని నిర్ధారించారు. వీరితోపాటు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజి)కు చెందిన బృందాలు కూడా జిల్లాకు చేరుకుని విచారణ జరుపుతున్నాయి. సూర్యాపేట బస్టాండ్‌లో సీసీ టీవీ ఫుటేజీని, నిందితుల సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాలను చూస్తున్నారు.

నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఫ్రీజర్‌ సౌకర్యం లేకపోవటంతో ఉగ్రవాదుల మృతదేహాలను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పలు విచారణ బృందాలు వచ్చే అవకాశం ఉండటంతో మరో రెండు రోజులు మృతదేహాలను అక్కడే ఉంచే అవకాశం ఉంది.

సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో అయూబ్‌, జకీర్‌ను పోలీసులు ప్రశ్నించినప్పుడు వారి వద్ద ఓ బ్యాగ్‌ ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో వారిద్దరి వద్ద పోలీసుల నుంచి అపహరించుకుపోయిన కార్బన్‌ గన్‌, రెండు దేశవాళీ తుపాకులు మినహా ఏమీ లేవు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగు ఏమైందన్న కోణంలోనూ పోలీసులు విచారణ సాగుతోంది.

ఈ బ్యాగు దొరికితే సిమి ఉగ్రవాదుల వ్యూహం ఏమిటన్నది తెలుసుకోవచ్చని, అందులో ల్యాప్‌టాప్‌ తదితర వస్తువులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ బ్యాగు కోసం భారీ అన్వేషిస్తున్నారు. అర్వపల్లి దర్గా మౌలానాను పోలీసులు విచారించారు. సిమి, ఐఎస్ఐ వంటి సంస్థలకు కొరియర్లుగా పనిచేసే స్లీపర్ సెల్స్‌పై పోలీసులు దృష్టిసారించారు.

సిమి జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన సలావుద్దీన్‌ నల్గొండ జిల్లాకు చెందిన వాడే. గత ఏడాది చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. హిరేన్‌పాండ్యా హత్య కేసులో నిందితుడు, ఐఎస్ఐ తీవ్రవాది అస్ఘర్ అలీ కూడా ఈ జిల్లాకు చెందిన వాడే. మరోవైపు ఈ సంస్థలకు సహకరించేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున స్లీపర్‌ సెల్స్‌ పని చేస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. వీరిపై నిఘా పెంచారు.

మరింత క్షీణించిన సిద్దయ్య ఆరోగ్యం

ఎన్‌కౌంటర్లో గాయపడ్డ ఎస్సై సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షిణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+