అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో వ్యభిచారం, రెస్క్యూ హోంకు గర్ల్స్

దీంతో పోలీసులు ఆ ఫ్లాటుపై దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నిర్వాహకుడు, కొత్తగూడకు చెందిన ఓ వ్యక్తితో పాటు మరో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను రెస్క్యూహోంకు తరలించారు. నిర్వాహకులను రిమాండుకు పంపించారు.
టెక్కీ కేసులో వీడిన చిక్కుముడి
నాచారం స్టేషన్ పరిధిలో అదృశ్యమైన సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగి రత్నేష్ కుమార్ మిశ్రా హత్య కేసును పోలీసులు చేధించారు. రత్నేష్ హైటెక్ సిటీలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ చదివే సమయంలో అల్వాల్ వెంకటాపురానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో రత్నేష్ నిరాకరించాడు.
కొంతకాలంగా దూరంగా ఉండి తిరిగి ఆ అమ్మాయి వెంటపడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి చెప్పింది. ఈ క్రమంలో దినేష్ తన మిత్రులైన వినోద్, అక్షయ్‌లకు చెప్పాడు. గత జనవరిలో రత్నేష్‌ను గాయపరర్చి హెచ్చరించారు. అయినా అతను ప్రవర్తన మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 25న రత్నేష్‌ను బైక్ పైన అల్వాల్ కౌకూర్‌కు తీసుకు వెళ్లారు.
అనంతరం రత్నేష్‌ను కొట్టి.. బండరాయితో మోది హత్య చేశారు. మృతదేహంపై పెట్రోలి పోసి కాల్చారు. అనుమానం రాకుండా నిందితులు విజయవాడకు వెళ్లారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి కేసును చేధించారు. నిందితులతో పాటు యువతిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications