వ్యభిచార గృహాలపై దాడులు, అరెస్టైన వారిలో 23 గర్ల్స్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లి పరిధిలో వ్యభఇచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు శనివారం సాయంత్రం ఒకే సమయంలో పలు వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకులు, విటులతో పాటు మొత్తం 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.
టీంలుగా ఏర్పడ్డ పోలీసులు దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో నలుగురు మహిళా నిర్వాహకులు ఉన్నారు. అరెస్టయిన వారిలో 23 మంది యువతులు ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మల్లాపూర్ సూర్య నగర్‌లో రైల్వే ట్రాక్ పక్కన చెట్ల పొదల్లో యువతి మృతదేహం పడి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతి చెవికి రింగు, ఎడమ చేతికి కడెం ఆధారంగా ఆమెను మల్లాపూర్ మర్రిగూడకు చెందిన మానసిక వికలాంగురాలిగా గుర్తించారు.
ఈవ్ టీజర్ల అరెస్ట్
ఎంఎంటిఎస్ రైళ్లలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న వారిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవ్ టీజింగ్ పట్టాల వద్ద మూత్రవిసర్జన చేయడం, టిక్కెట్ లేకుండా ప్రయాణం, మహిళా, వికలాంగుల బోగీలో ప్రయాణిస్తున్న యాభై మందిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications