హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుట్టపై వ్యభిచారం: అదుపులో 11 జంటలు, అభివృద్ధికి భూసేకరణకు కమిటీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపై వ్యభిచారం జోరుగా జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం పలు లాడ్జిలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదకొండు జంటలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోబోమని ఈ సందర్భంగా పట్టుబడిన జంటలను హెచ్చరించారు.

 hyderabad

గుట్ట అభివృద్ధి భూసేకరణకు కమిటీ

యాదగిరి గుట్ట అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట అభివృద్ధి భూసేకరణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా స్థానిక ఆర్డీవో, తహసీల్దార్ ఉన్నారు. యాదగిరిగుట్టను మరో తిరుమలగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామి ఇచ్చిన విషయం తెలిసిందే.

English summary
Police raids in Yadagirigutta Lodges expose couples indulging in Indecent Activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X