మిత్రుడ్ని తరిమేసి, యువతిపై పోలీసుల అత్యాచారం

పొత్తూరువారితోట ప్రధాన రహదారిలో నడిచి వెళ్తున్న ఓ యువతిపై రాత్రి గస్తీలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డు బెదిరించి అత్యాచారం చేశారనే ఆరోపణపై జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ విచారణ చేపట్టారు. విచారణలో సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి - సోమవారం అర్థరాత్రి ఓ యువకుడు, యువతి పొత్తూరువారితోటలో నడిచి వెళ్తుండగా రాత్రి గస్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్, హోంగార్డులు అడ్డగించారు. యువకుడిని బెదిరించి పంపించివేసి ఆ తర్వాత ఆ యువతిని భయపెట్టి లొంగదీసుకున్నారు.
ఆ సంఘటన విషయం తెలియగానే అర్బన్ ఎస్పీ తీవ్రంగా ప్రతిస్పందించి విచారణకు ఇద్దరు ఎస్ఐలను ఆదేశించారు. ఆ కానిస్టేబుల్ ఎవరనే విషయంపై విచారణ చేపట్టిన ఎస్ఐలు నిర్ధారణకు వచ్చారు. అయితే, బాధితురాలి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్పీకి నివేదించారు. అయితే, స్టేషన్ సిబ్బంది ప్రవర్తనపై ఎస్పీ ఎస్ఐలు ఇద్దరిని పిలించుకుని సంఘటన పూర్వపరాలు తెలుసుకున్నారు.
బాధిత యువతిది నంద్యాల అనే విషయం ఎస్పీ తెలుసుకున్నారు. ఆమె చిరునామా తెలుసుకుని వెళ్లి యువతి నుంచి ఫిర్యాదు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అందుకు ఇద్దరు సిబ్బందిని నంద్యాలకు పంపించారు. కాగా, కానిస్టేబుల్, హోంగార్డు యువకుడిని, యువతిని బెదిరిస్తున్న దృశ్యాలు ఓ కార్యాలయం వెలువల ఉన్న సిసిటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీని పోలీసులు సేకరించి, విచారణ వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications