వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ కేంద్రంగా టీడీపీ పోరుబాట - నేతల హౌస్ అరెస్ట్..!!

|
Google Oneindia TeluguNews

విశాఖ కేంద్రంగా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. ఉమ్మడి విశాఖ టిడిపి పోరుబాటకు పార్టీ నేతలు నిర్ణయించారు. నిరసన కార్యక్రమాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతలంతా పాల్గొనాలని నిర్ణయించారు. రుషికొండను ధ్వంసం చేసి అక్కడ సీఎం జగన్‌ కోసం కార్యాలయం నిర్మిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రుషికొండ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. దీనికి పోలీసుల నుంచి అనుమతి కోరింది. అయితే నగరంలో సెక్షన్‌ 30 అమలులో వున్నందున అనుమతి ఇవ్వలేమని అధికారులు తోసిపుచ్చారు.

ఉత్తరాంధ్ర కు చెందిన టీడీపీ నేతలను ముందుగానే హౌస్‌ అరెస్టులు చేసారు. ఋషికొండ ప్రాంతంలో బారీగా పోలీసుల మొహరించారు. నార్త్ సబ్ డివిజన్ లో 30 యాక్ట్ ఉందని పోలీసులు వెల్లడించారు. ఎవ్వరు ర్యాలీ, మీటింగ్స్ నిర్వహించకూడదని పోలీసు అధికారులు స్పష్టం చేసారు. ఎవ్వరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖ రుషికొండ కి వెళ్లేందుకు సిద్ధం అయిన ఎమ్మెల్యే చినరాజప్ప తో పాటుగా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు.

Police Restricted TDP leaders protest rally Chalo Rushikonda, many leaders house arrest

ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరుబాట కార్యక్రమాన్ని సీఎం జగన్ అడ్డుకోవడం అప్రజాస్వామికమని చిన రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఈ కార్యక్రమాన్నిఅడ్డుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు నిర్బంధించడాన్ని బట్టి చూస్తే జగన్ అరాచకపాలక స్పష్టమవుతోందని విమర్శించారు. రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలు, పేదల స్థలాల ఆక్రమణ వంటి అంశాల పైన టీడీపీ పోరుకు నిర్ణయం తీసుకుంది. రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు.

English summary
Police Restricted TDP leaders on Chalo Rushikonda call, many leaders house arrest in north caostal districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X