వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీయం ర‌మేష్ నివాసం లో సోదాలు ఉత్తుత్తివే ?: కోరి... చేయించుకున్నారా..?: ఎస్పీకే స‌మాచారం లేదు..!

|
Google Oneindia TeluguNews

క‌డ‌ప రాజ‌కీయాల్లో హాట్ టాపిక్. రెండు రోజుల క్రితం కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ ఇంటిలో పోలీసులు తని ఖీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఎంపీ ఇంట్లోకి 40 మంది పోలీసులు ప్రవేశించి ఆయన బెడ్‌రూమ్‌లోనూ సోదాలు చేశారు... వారెంట్‌ లేకుండా నా ఇంటికి వచ్చి తనిఖీలు చేస్తారా అంటూ సీఎం రమేష్‌ ఖాకీలపై వీరంగం చేసారు. అయితే, ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని..జిల్లా ఎస్పీకే స‌మాచారం లేద‌ని తెలుస్తోంది.

ఎస్పీకి స‌మాచారం లేకుండా సిఐ నేతృత్వంలో..
క‌డ‌ప జిల్లాలో సీయం ర‌మేష్ నివాసంలో దాదాపు 40 మంది పోలీసులు సోదాలు చేసార‌నే వార్త పై ర‌క‌ర‌కాల క‌ధ‌నాలు వెలు వ‌డ్డాయి. కేంద్ర ప్ర‌భుత్వం..ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలోనే టిడిపి నేత‌ల పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేర‌కే తాము సోదాలు చేస్తున్న‌ట్లు పోలీసులు చెప్పార‌ని టిడిపి నేత‌లు చెప్పుకొచ్చారు. అయితే, అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంలో ఎర్ర‌గుట్ల అర్బ‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ బీవీ ర‌మ‌ణ వ్య‌వ‌హార శైలి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Police searches in CM Ramesh House is high drama : Suspected by english media

ఎంపీ, ఎంఎల్‌ఏ ఇంట్లో సోదాలు చేయాలంటే
సంబంధిత డీఎస్పీ, ఎస్పీ, డీఐజీలకు సమాచారం అందించాల్సి ఉండగా, ఆయన ఇవేమీ ఖాతరు చేయకుండా ఎంపీ ఇంటి వద్ద ఉన్న సమయంలోనే సీనియర్‌ అధికారులకు సమాచారం ఇవ్వకుండా సోదాలకు వెళ్లడం వివాదాస్పద మైంది. కర్నూలు నుంచి కడపకు ఇటీవల బదిలీ అయిన రమణ ఎంపీ ఇంట్లో సోదాలు చేసిన బృందానికి నేతృత్వం వహించారు.

ఆంగ్ల ప‌త్రిక క‌ధ‌నంతో..
సీయం ర‌మేష్ నివాసం లో పోలీసుల సోదాల్లో జిల్లా ఎస్పీతో ఉన్న‌తాధికారుల‌కు ఎవ‌రికీ సంబంధం లేద‌ని ఆ క‌ధ‌నం లో పేర్కొన్నారు. కేవ‌లం ఓ ఇన్‌స్సెక్ట‌ర్ స్థాయి అధికారి త‌న బృందంతో ఈ సోదాలు చేసార‌న పేర్కొంది. అయితే, ఆ అధికారి క‌ర్నూలు జిల్లా నుండి క‌డ‌ప కు ఆ ఎంపి సిఫార్సుతోనే బ‌దిలీ పై వ‌చ్చార‌ని చెబుతున్నారు. కేవ‌లం ఎన్నిక‌ల వేళ‌..పార్టీ పై ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌టం..ఇత‌ర పార్టీల పై ఆరోప‌ణ‌లు చేయ‌టం కోస‌మే ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రించార నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌ధనాన్ని బిజెపి నేత‌లు సైతం ప్ర‌స్తావించారు.

Police searches in CM Ramesh House is high drama : Suspected by english media

ఇదంతా ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన సోదాలు అని..ఇందులో వాస్త‌వాలు లేవ‌ని బిజెపి ఎంపి జీవిఎల్ న‌ర‌సింహారావు చెబుతున్నా రు. సోదాలు అయితే కేవ‌లం టిడిపి నేత‌ల మీదే ఎందుకు చేస్తున్నార‌ని టిడిపి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ,ఈ సోదాల స‌మాచారం జిల్లా ఎస్పీకే తెలియ‌క పోవ‌టం పై ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ మొద‌లైంది. దీని పై ఎన్నిక‌ల సంఘానికి నివేదించేందుకు వైసిపి సిద్ద‌మైంది.

English summary
Police Searches in CM Ramesh house is hi dama. An english news paper given news on this issue. Kadapa SP also no infor mation on this searches according to that news Paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X