బుల్లితెర నటి కోసం గాలింపు: బెంగళూర్‌కు పోలీసులు

Vijaya Rani
హైదరాబాద్: తోటి నటీనటుల సంపాదనను చిట్టీల రూపంలో నొక్కేసిన బుల్లితెర నటి విజయరాణి కోసం హైదరాబాద్ నేర పరిశోధన విబాగం (సిసిఎస్) పోలీసులు గాలిస్తున్నారు. ఆమెను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చిట్టీల విషయంలో చేసే మోసాలు బయటపడకుండా విజయరాణి చాలా జాగ్రత్తలు తీసుకుంది.

శ్రీనగర్‌కాలనీలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను ముందుగానే ఖాళీ చేసేసింది. తన ఫ్లాట్‌లోని సామగ్రిని బెంగళూరుకు తరలించేసింది. ఈ తతంగాన్ని కూకట్‌పల్లికి చెందిన ట్రాన్స్‌పోర్టు కంపెనీకి అప్పగించింది. ఈ ఆధారాన్ని రాబట్టిన పోలీసులు బెంగళూరు బయలుదేరి వెళ్లారు. నటీనటుల నుంచి వసూలు చేసిన డబ్బుతోనే నగరంలో రెండు మెస్‌లు, హోటల్ నిర్వహిస్తోందని సమాచారం. కొందరు నటీనటులను మచ్చిక చేసుకునేందుకు ఇంటికి తీసుకు వెళ్లిన విజయరాణి ఏనాడూ తన కుమారుడు షరణ్ ముఖాన్ని చూపించలేదు.

అతడు ప్రతిసారీ ముసుగులోనే వారికి దర్శనమిచ్చేవాడు. ముసుగు గురించి ప్రశ్నించినప్పుడల్లా విజయరాణి ఏవేవో కథలు వినిపించేంది. ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసిందని బాధితులు చెబుతున్నారు. ఆమె పేరున కృష్ణా జిల్లాలోని గుడివాడలోనూ ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

ఈ మోసంలో విజయరాణికి ఆమె సోదరి దుర్గతో పాటు సుధారాణి, నాని, శ్రీనివాసరావు సహకరించారు. వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరూ అజ్ఞాతంలో ఉన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరిలో శ్రీనివాసరావును పోలీసులు తీసుకొచ్చి విచారించి పంపేశారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+