తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుజనా చౌదరికి చేదు అనుభవం: సైన్స్ మ్యూజియంకు బాబు శంకుస్థాపన

కేంద్రమంత్రి, తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరికి చేదు అనుభవం ఎదురైంది.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: కేంద్రమంత్రి, తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. తిరుపతి జూ పార్క్ సమీపంలో సైన్స్ మ్యూజియం శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు వచ్చిన ఆయనను పోలీసులు బుధవారం అడ్డుకున్నారు.

సుజనా చౌదరిని జూ పార్క్ సమీపంలోనే అడ్డుకోవడంతో ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడుకు వివరించారు. దీంతో చంద్రబాబు.. తిరుపతి అర్బన్ ఎస్పీని పిలిపించి విషయంపై ఆరా తీశారు. కాగా, ఇంతకుముందు ఇలాంటి అనుభవమే ఇటీవల రాష్ట్ర మంత్రి దేవినేని ఉమాకు కూడా ఎదురైంది.

police stops sujana chowdary

సైన్స్ కాంగ్రెస్ కాంగ్రెస్‌కు శంకుస్థాపన

తిరుపతిలో అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన శాల(సైన్స్‌ మ్యూజియం)కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. 'బ్రహ్మాండ్'గా నామకరణం చేసిన ఈ మ్యూజియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతిలోని అలిపిరి వద్ద 200 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.

డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో దీని నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి,. రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే అంతర్జాతీయ మ్యూజియం నమూనా సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన నమూనాను మంగళవారం సాయంత్రం డీఆర్‌డీఓ ప్రదర్శనశాల వద్ద ఏర్పాటుచేశారు.

మ్యూజియానికి సంబంధించిన ప్రతిపాదనలు, నమూనాను సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయమంత్రి సుజనాచౌదరి, రక్షణశాఖ సలహాదరు సతీష్‌రెడ్డి తీసుకెళ్లారు.

English summary
Police allegedly stops Union Minister sujana chowdary in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X