పోలీసు మాధవ్ నామినేషన్ ఆమోదం : ఉత్కంఠకు తెర : ఇక..ఎన్నికల గోదాలో..!
పోలీసు మాధవ్ నామినేషన్ ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. ఎన్నికల బరిలో దిగేందుకు లైన్ క్లియర్ అయింది. నా మినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. పోలీసు ఉద్యోగానికి స్వచ్చంద రాజీనామా చేసిన మాధ వ్ ను ప్రభుత్వ ఉద్దేశ పూర్వకంగా రాజీనామానున ఆమోదించుకుండా వేధిస్తోందని మాధవ్ ఎన్నికల సంఘాన్ని ..ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు మాధవ్ కు ఎన్నికల బరిలోకి దిగేందుకు అనుమతి లభించింది.
నామినేషన్ ఆమోదం..
హిందూపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మాధవ్ నామినేషన్‌ను స్క్రూటీని చేసిన తరువాత ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించింది.

అందులో భాగంగా ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యు నల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో..హిందూపురం ఎంపీగా మాధవ్ పోటీలో ఉన్నారు.
పోరాడి సాధించిన మాధవ్..
జేసి బ్రదర్స్ మీద మీసం మెలేసి..ఆ తరువాత రాజకీయంగా అనూహ్యంగా మాధవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతే అనూహ్యంగా హిందూపూర్ ఎంపి అభ్యర్దిగా ఖరారయ్యారు. అప్పటి నుండి ఆయన తన రాజీనామా కోసం ప్రత్నాలు చే స్తూనే ఉన్నారు. అయితే, ప్రభుత్వం సైతం అదే స్థాయిలో ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టింది. దీని పై మాధవ్ ఎన్నికల సంఘాన్ని..ట్రిబ్యునల్ ఆశ్రయించారు. ట్రిబ్యునల్ మాధవ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చినా..దీని పై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.

అక్కడ వారి అభ్యర్దన ను హైకోర్టు స్టే కు నిరాకరించింది. సోమవారం హిందూపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలను కూడా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన భార్య సునీతతో కూడా నామినేషన్ దాఖలు చేయించారు. ఈ రోజు అభ్యర్థుల నామినేషన్‌లను పరిశీలించిన ఎన్నికల అధికారులు మాధవ్ నామినేషన్‌ను ఆమోదించినట్టు ప్రకటించారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications