Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ షర్మిల కు ఆసక్తికరంగా నారా లోకేష్ రిప్లై..!

ఏపీ రాజకీయాల్లోకి పీసీసీ ఛీఫ్ గా వైఎస్ షర్మిల (ys sharmila) ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనతో మాత్రం సన్నిహితంగా ఉన్నట్లే కనిపిస్తుంటారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ కీలక నేత నారా లోకేష్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం దగ్గరి నుంచి వారితో భేటీలు కావడం వరకూ షర్మిల వైఖరి సొంత పార్టీకే అంతుబట్టకుండా ఉంటుంది. ఇదే క్రమంలో షర్మిల ఇవాళ మంత్రి నారా లోకేష్ (nara lokesh) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవాళ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సొంత పార్టీ టీడీపీకి చెందిన కింది స్దాయి క్యాడర్ నుంచి అగ్రనేతలు, మంత్రుల వరకూ ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మిత్రపక్షాలు జనసేన, బీజేపీకి చెందిన నేతలతో పాటు టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు కూడా లోకేష్ కు విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కూడా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉదయం ట్వీట్ చేశారు. దీనికి సాయంత్రం లోకేష్ రిప్లై ఇచ్చారు.

Political Buzz AP Minister Nara Lokesh s Reply To YS Sharmila s Birthday Wish Creates A Stir

మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. అంటూ ఉదయం వైఎస్ షర్మిల లోకేష్ కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా లోకేష్.. షర్మిల గారు, మీ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు అంటూ రిప్లయ్ ట్వీట్ చేశారు. గతంలోనూ పలుమార్లు ఇలాగే వీరిద్దరూ పరస్పరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. షర్మిల తో పాటు ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ లోకేష్ వ్యక్తిగతంగా ఎక్స్ లో స్పందిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+