వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ: బాబు స్టెప్పులు, ఆడిపాడి హోరెత్తించిన ఎయిర్ హోస్టెస్‌లు (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: హోలీ వేడుకల్లో రాజకీయ నాయకుల నుంచి ఎయిర్ హోస్టెస్ వరకు అందరూ పాల్గొని, ఆనందం పంచుకుంటున్నారు. హైదరాబాదులో హోలీ వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

చంద్రబాబు తలపాగా చుట్టి సరికొత్తగా కనిపించారు. ఈ తర్వాత డప్పు చేతబట్టి దరువు వేశారు. అక్కడికి వచ్చిన లంబాడీ మహిళలతో కలిసి స్టెప్పులేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరి జీవితాలు కొత్త వెలుగులతో కళకళలాడాలని ఆకాంక్షించారు. చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన కూడా తలపాగా చుట్టారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెక్ కాలనీలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన డప్పు వాయించారు. ఎర్రగడ్డలో మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

Political leaders to air hostess in Holi celebrations

ఇదిలా ఉండగా, విమానంలోను హోలీ సంబరాలు జరుపుకున్నారు. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లను ఇస్తున్న స్పైస్ జెట్... హోలీ సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండో - పాక్ బార్డర్లో సైనికులు హోలీ సంబరాలు జరుపుకున్నారు.

హోలీ పర్వదినానికి ఓ రోజు ముందుగా మంగళవారం తన విమానాల్లో ఎక్కిన ప్రయాణికులకు ప్రవేశద్వారం వద్దే ఆత్మీయ స్వాగతం పలికింది. ఎయిర్ హోస్టెస్‌లు ప్రయాణీకుల నుదుట తిలకం దిద్దారు. ఆపై ప్రయాణికులను వారి సీట్ల వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి, ఆ తర్వాత బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు.

ఎయిర్ హోస్టెస్‌ల స్టెప్పులతో కొందరు ప్రయాణికులు కూడా జత కలిశారు. గతేడాది మిడ్ ఎయిర్‌లో హోలీ వేడుకలకు తెర తీసిన స్పైస్ జెట్ సిబ్బంది... ఈ ఏడాది మాత్రం విమానం టేకాఫ్ తీసుకోకముందే సందడి షురూ చేశారు. ఇక మెనూ కార్డులకూ రంగులద్ది ప్యాసెంజర్లకు అందించారు. ఈ వినూత్న వేడుకలకు సంబంధించిన వీడియోను బుధవారం ఉదయం స్పైస్ జెట్ విడుదల చేసింది.

English summary
Political leaders to air hostess in Holi celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X