నంద్యాల పోరు: 2019కి సెమీ ఫైనల్, జగన్ అంతా తానే..

కర్నూలు: నంద్యాల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రచారం వేడెక్కింది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్‌గా ఇరు పార్టీలు భావించడమే ఇందుకు కారణం.

ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీ 2019లో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా దీనికి ఉంది. అందుకే జగన్ అన్నీ తానే అయి ప్రచారం సాగిస్తుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులను కూడా రంగంలోకి దింపారు.

ఇరు పార్టీలు కూడా విజయం కోసం సర్వశక్తులూ ధారపోస్తున్నారు. చంద్రబాబును ప్రధాన లక్ష్యంగా చేసుకుని వైసిపి అధినేత జగన్ ప్రచారం సాగుతుండగా, జగన్‌ను టార్గెట్ చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ ప్రచారం సాగిస్తోంది. ఈ స్థితిలో అందరి చూపూ నంద్యాలపైనే కేంద్రీకృతమైంది.

వ్యూహాత్మకంగా మంత్రులు....

వ్యూహాత్మకంగా మంత్రులు....

తమకు సానుకూలంగా ఉన్న పట్టణ ఓటర్లను తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో భారీ ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ ప్రచారంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వారికి ఎప్పటికప్పుడు చంద్రబాబు నుంచి ఆదేశాలు వస్తున్నాయి.

Recommended Video

    Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
    సానుభూతి కోసం....

    సానుభూతి కోసం....

    భూమా నాగిరెడ్డి కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియ, నాగమౌనిక అవిశ్రాంతంగా ప్రచారం సాగిస్తున్నారు. సానుభూతి ఓటుతో గట్టెక్కాలని వారు ప్రయత్నిస్తున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. దానివల్ల తమకు సానుభూతి ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. మంత్రులు, సీనియర్ నాయకుల సహకారంతో భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

    జగన్ మకాం వేసి...

    జగన్ మకాం వేసి...

    జగన్ ఈనెల9నుంచి నంద్యాలలోనే మకాం వేశారు. ఇప్పటికే నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లోని ప్రతీ గ్రామాన్ని చుట్టివచ్చారు. 21వ తేదీ వరకు ఇక్కడే ఉండి ప్రచారం చేసేలా రోడ్ మ్యాప్ వేసుకున్నారు. తమ అభ్యర్థి ఓడినా, టీడీపీకి భారీ మెజార్టీ వచ్చినా ఆ ప్రభావం రాబోయే ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశంతోనే జగన్ సుదీర్ఘ పర్యటనను పెటటుకున్నారు.

    తానే బరిలో ఉన్నట్లు..

    తానే బరిలో ఉన్నట్లు..

    ఈ ఎన్నిక నంద్యాలకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు, తన భవిష్యత్తుకు సంబంధించిందని ఆయన బావిస్తున్నారు. దీంతో తానే బరిలో నిలిచినట్లుగా జగన్ ప్రచారం సాగుతోంది. ఆయన చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు.

    అప్పటి కుటుంబాలే...

    అప్పటి కుటుంబాలే...

    2014 ఎన్నికల్లో తలపడిన అభ్యర్థుల కుటుంబాలే ఈ ఉపఎన్నికలో కూడా తలపడుతున్్నాయి. అయితే వారి పార్టీలే వేరు. నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై భూమా నాగిరెడ్డి 3604 ఓట్లతో గెలుపొందారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన భూమా టిడిపిలో చేరారు. దాంతో ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుడైన బ్రహ్మానందరెడ్డి టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన శిల్పా ఇప్పుడు వైసిపి నుంచి పోటీ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+