"ఫిక్స్" చేసిన పవన్, ఆ వ్యాఖ్యల వెనుక- లెక్క పక్కా..!!
పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పవన్ బహిరంగంగా హోం మంత్రికి.. పోలీసులకు సూచనలు చేస్తూనే చురకలు అంటించారు. ఆగ్రహం వ్యక్తం చేసారు. తానే హోం శాఖ స్వీకరిస్తే అంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే, అంతర్గతంగా చెప్పాల్సిన అంశాలు ఇలా ఓపెన్ గా చెప్పటం వెనుక పవన్ భారీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.
పవన్ ఫిక్స్ చేసారా
పిఠాపురం వేదికగా పవన్ రాష్ట్రంలో శాంతి భద్రతల పైన స్పందించారు. రాష్ట్రంలో బావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడితే సహించాలా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వరుసగా జరగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. హోం మంత్రి, డీజీపీకి బహిరంగ సూచనలు చేసారు. పవన్ వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది. పవన్ వ్యాఖ్యలతో హోం మంత్రి తన శాఖ నిర్వహణలో విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రజలు తమను తిట్టుకుంటున్నారని.. పోలీసులు సమర్ధవంతం గా పని చేయాలని పవన్ బహిరంగంగా చెప్పటం కూడా ప్రభుత్వంలోని ముఖ్యులకు అంతు చిక్కటం లేదు.

ఓపెన్ కామెంట్స్
డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు సరిగా లేవనే విధంగా వ్యాఖ్యలు చేయటం ఏంటనే ప్రశ్న టీడీపీ క్యాంపులో మొదలైంది. పరిస్థితిలో మార్పు రాకుంటే తానే హోం శాఖ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పటం ద్వారా పరోక్షంగా అనిత పని తీరు సరిగ్గా లేదనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పైన విపక్షాలు పవన్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పవన్ ఒక్కసారిగా సొంత ప్రభుత్వంలోని వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ డిస్కషన్ గా మారాయి. తనకు పదవులు డోన్ట్ కేర్ అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి..!!#PawanKalyan #VangalapudiAnitha #HomeMinsiter #ApGovt #AndhraPradesh pic.twitter.com/QTxLo5SNzt
— oneindiatelugu (@oneindiatelugu) November 4, 2024
పవన్ వ్యాఖ్యల వెనుక
పవన్ కు లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాలంటే స్వయంగా సీఎం చంద్రబాబుతో కలిసి డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించవచ్చు. కానీ, ఇలా ఓపెన్ గా డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ సహచర మంత్రి వైఫల్యం చెందున్నతారనే విధంగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు నచ్చటం లేదు. రాష్ట్రంలో క్రిమినల్స్ కు యోగి ఆదిత్యనాద్ తరహాలో కావాలని పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితికి నెట్టేస్తున్నారని చెప్పుకొచ్చారు. డీజీపీ, నిఘా అధికారులు బాధ్యత తీసుకోవాలని.. గత ప్రభుత్వ తరహాలో ఉండకూడదని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. పవన్ అరెస్ట్ చేయటానికి గతంలో అధికారులు ముందున్నారని.. ఇప్పుడు మాత్రం క్రిమినల్స్ ను అరెస్ట్ చేయటానికి వెనుకడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో ఉత్సాహం పెంచితే.. టీడీపీ క్యాంపులో ఆందోళనకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications