వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి సమయంలోనా రాజకీయాలు : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

|
Google Oneindia TeluguNews

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు . లాక్‌డౌన్‌ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారని ఎంపీ విజయసాయి తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విపత్కర సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు . కరోనాపై అందరం కలిసి పోరాటం చెయ్యాల్సిన సమయంలో రాజకీయాలు తగవని పేర్కొన్నారు.

బాబును తిట్టే టైమ్ రైతు సమస్యలపై పెట్టండి .. మంత్రి కన్నబాబుకు పంచుమర్తి పంచ్బాబును తిట్టే టైమ్ రైతు సమస్యలపై పెట్టండి .. మంత్రి కన్నబాబుకు పంచుమర్తి పంచ్

అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు. ఇక కరోనా బాధితుల కోసం వాలంటీర్లు ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ సడలించాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలో సుమారు 4800 మంది వైద్య పరిశీలనలో ఉన్నారని వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి తెలిపారు. కరోనా ప్రభావిత కేసుల నివేదికను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ సమర్పించినట్లు ఆయన తెలిపారు.

politics was not appropriate at this time : ycp mp Vijayasai reddy

ఈ 4800 మందికి స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరమైన అన్ని వస్తువులు సరఫరా చేస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద పారిశ్రామికవేత్తలు పేదలకు అండగా ఉండాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇప్పటివరకు విశాఖలో సీఎం, పీఎం సహాయ నిధికి రూ. 6 కోట్ల నిధులు విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు విజయసాయి రెడ్డి. ఈ మహమ్మారికి మందు లేనందున కు ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని పిలుపు నిచ్చారు.

English summary
MP Vijayasaray Reddy said that the AP government would take all possible measures for corona. MP Vijayasai said that the Chief Minister of Andhra Pradesh YS Jaganmohan Reddy had given adequate directions to the officials to ensure that the poor people did not suffer during the lockdown. He added that the opposition parties were also politicized during this disaster. He said that politics was not appropriate at the time of the fight over Corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X