AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇవాళే నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పాటే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 11తో ఎన్నికల ప్రచారం ముగియనుండగా.. 13న పోలింగ్ ఉంటుంది. అలాగే రేపటి నుంచి ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో వైసీపీకి కొన్ని,కూటమికి మరికొన్ని జై కొట్టాయి. ఇదే క్రమంలో మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనం మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పోల్ పల్స్ అనే సర్వే సంస్ధ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను ఇవాళ వెల్లడించింది. దాదాపు 25 పేజీల రిపోర్టులో రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో ఏయే పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, సీఎంగా జనం ఎవరివైపు మొగ్గుచూపుతున్నారు, పార్టీల వారీగా సాధించే ఓట్ల శాతం ఎలా ఉంది, రాష్ట్రంలో జనాభిప్రాయం వెనుక ఉన్న కారణాలేంటి ఇలా పలు అంశాలపై ఈ సర్వే సాగింది.

poll pulse pre-poll survey predicts clear edge for nda alliance over ysrcp in ap- here are details

పోల్ పల్స్ ప్రీపోల్ సర్వేలో ఈసారి రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీయే కూటమికి 98 నుంచి 104 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే వైసీపీకి 54-60 సీట్లు వస్తాయని తేల్చింది. 23 సీట్లలో మాత్రం గట్టిపోటీ ఉందని తెలిపింది. అలాగే జిల్లాల వారీగా ఫలితాలను కూడా వెల్లడించింది. రాష్ట్రంలో ఈసారి కూటమికి 51.2 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీకి 42.8 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ కు 3.6 శాతం ఓట్లు, ఇతరులకు 2.4 శాతం ఓట్లు రాబోతున్నట్లు పేర్కొంది.

25 ఎంపీ సీట్లలో టీడీపీ కూటమికి 18 సీట్లు, వైసీపీకి 6 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. అలాగే విజయనగరం లోక్ సభ సీటులో గట్టిపోటీ ఉందని తెలిపింది. వైసీపీ గెలిచే ఎంపీ సీట్లలో అరకు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి, రాజంపేట ఉన్నాయి. మిగిలిన సీట్లలో కూటమి పార్టీలు గెలవబోతున్నాయి. బీజేపీ అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లను గెల్చుకోనుండగా.. జనసేన పోటీ చేస్తున్న రెండు సీట్లు బందరు, కాకినాడలో గెలుస్తుందని సర్వే తెలిపింది.

అలాగే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 32 శాతం, బాగోలేదని 44 శాతం మంది చెప్పారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని 41 శాతం, రాదని 52 శాతం చెప్పారు. సీఎంగా జగన్ కు 42.5 శాతం, చంద్రబాబుకు 50 శాతం మంది మొగ్గు చూపారు. అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా రోడ్లు, మౌలిక సదుపాయాల లేమి అని 21 శాతం, ధరల పెరుగుదల అని 18 శాతం, నిరుద్యోగమని 15 శాతం, అవినీతి 14 శాతం, రైతు సమస్యలు 13 శాతం మంది చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+