వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో 35 శాతం పోలింగ్‌: బారులు తీరిన ఓట‌ర్లు : గ‌తం కంటే పెరుగుతుందంటున్న ఇసి..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 12 గంటల వ‌ర‌కు మొత్తంగా 35 శాతం పోలింగ్ న‌మోదైంది. అత్య‌ధికంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పోలింగ్ శాతం న‌మోదైంది. ఉద‌యం కొన్ని ప్రాంతాల్లో ఇవియం ల స‌మస్య‌లు తలెత్త‌టం తో పోలింగ్ కొన్ని చోట్ల ఆల‌స్యంగా ప్రా రంభ‌మైంది. దీంతో..పోలింగ్ శాతం త‌గ్గుంద‌ని అందరూ భావించారు. అయితే, ఇప్పుడు జ‌రుగుతున్న పోలింగ్ స‌ర‌ళి చూ స్తే గ‌తం కంటే ఎక్కువ‌గానే పోలింగ్ న‌మోద‌వుతుంద‌ని ఎన్నిక‌ల అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

12 గంట‌ల వ‌ర‌కు 35 శాతం పోలింగ్..

12 గంట‌ల వ‌ర‌కు 35 శాతం పోలింగ్..

ఏపి లోని మొత్తం 13 జిల్లాల్లోనూ 12 గంట‌ల వ‌ర‌కు 35 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల సంఘం నిర్ధారించింది. తొలి గంట లో మండ‌కోడిగా క‌నిపించిన పోలింగ్ శాతం ఇవియం ల స‌మ‌స్య ప‌రిష్కారం త‌రువాత వేగం పుంజుకుంది. తొలుత అనేక ప్రాంతాల్లో ఇవియం ల స‌మ‌స్య‌ల కార‌ణంగా పోలింగ్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. దాదాపు గంట త‌రువాత అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ప్రారంభ‌మైంది. దీంతో..తొలి గంట లో తొమ్మ‌ది నుండి 11 శాతం వ‌ర‌కు మాత్ర‌మే పోలింగ్ న‌మో దైంది. అయితే, ఎన్నిక‌ల అధికారులు ఇవియం ల మార్పు..మ‌ర‌మ్మ‌త్తుల పై దృష్టి పెట్ట‌టం తో తిరిగి పోలింగ్ వేగం మ‌రింత‌గా పుంజుకుంది. దీంతో..ఎన్నిక‌ల సంఘం ఇస్తున్న స‌మాచారం మేర‌కు 12 గంట‌ల స‌మ‌యానికి రాష్ట్రం మొత్తం గా 35 శాతం పోలింగ్ న‌మోదైంది.

అధికంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో..

అధికంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో..

12 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ స‌ర‌ళి చూస్తే రాష్ట్రం మొత్తంగా 35 శాతం పోలింగ్ న‌మోదు కాగా.. అత్య‌ధికంగా విజ‌య‌న‌గ రం జిల్లాలో 31.57 శాతం న‌మోదైంది. కాగా, శ్రీకాకుళం లో 19.78 శాతం, విశాఖ లో 21.64 శాతం, తూర్పు గోదావ‌రి లో 20041, గుంటూరు లో 24 శాతం, ప్ర‌కాశం లో 22 శాతం, నెల్లూరు లో 23.22 శాతం, క‌డ‌ప లో 17.84, అనంత‌పురంలో 21.47 శాతం గా అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ ఇంకా ఓట‌ర్లు బారులు తీరి ఉన్నారు. అయితే, అన్ని ప్రాంతాల్లో మ‌హిళ‌లు..వృద్దులు అధిక సంఖ్య‌లో పాల్గొంటున్నారు.

గ‌తం కంటే అధికంగా అవ‌కాశం..

గ‌తం కంటే అధికంగా అవ‌కాశం..

గ‌త ఎన్నిక‌ల్లో ఏపి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మొత్తంగా 78 శాతం పోలింగ్ న‌మోదైంది. అయితే, ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం గ‌తం కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుంద‌నే అంచ‌నా వ్య‌క్తం చేస్తోంది. 12 గంట‌ల వ‌ర‌కు ఏపి వ్యాప్తంగా 35 శాతం న‌మోదు కావ‌టం..ఇప్ప‌టికీ అన్ని జిల్లాల్లో ఓట‌ర్లు బారులు తీరి ఉండ‌టంతో 85 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రిగే ఛాన్స్ ఉంటుంద‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు అంచ‌నా వేస్తున్నారు. సాయంత్రానికి పోలింగ్ శాతం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని..ఇప్ప‌టి నుండి క్యూ లైన్లు వేగంగా క‌దులుతున్నాయ‌ని అధికారులు చెబుతున్నారు.

English summary
In AP elections up to 12 pm total polling percentage is 35. In 2014 elections over all 78 percent of polling took place. Now in this elections it may cross last elections percentage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X