వల్లభనేని వంశీ బెదిరింపు, అధికారిని కొట్టిన జగన్ పార్టీ

విజయవాడ/గుంటూరు: తెలుగుదేశం పార్టీ గన్నవరం టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీ బెదిరింపులకు పాల్పడ్డారు. ఉంగుటూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏజెంట్లను బెదిరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు తనయుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు పోలింగ్ కేంద్రం వద్ద చేతులు తిప్పుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని సైగలు చేశారు.

ఎడ్ల బండిపై వచ్చిన రఘువీరా

ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను కాంగ్రెసు పార్టీకి ఓటు వేసినట్లు చెప్పారు. ఆయన తన ఇంటి నుండి ఎద్దుల బండిలో వచ్చారు.

Polling starts in AP for Lok Sabha, assembly seats

పోలింగ్ అధికారిని కొట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నడవలూరులో పోలింగ్ అధికారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కొట్టారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బలో జగన్ పార్టీ నేత పెద్దిరెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి టిడిపి ఏజెంట్లను బెదిరించినట్లుగా తెలుస్తోంది.

పోలింగ్ ఏజెంట్ కిడ్నాప్

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెంలో టిడిపి పోలింగ్ ఏజెంట్‌ను వైకాపా వర్గీయులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలింగ్ బూత్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో టిడిపి, బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

శ్రీకాంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘన

కడప జిల్లా రాయచోటి శాసనసభ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. రాయచోటి డైట్ పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేయమని అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+