పండగకు ఊరెళ్తున్నారా - బాదుడే బాదుడు : రిటర్న్ జర్నీకి అవస్థలే..!!

మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి పండగు ప్రారంభం కానుంది. గత రెండేళ్లు సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు. కరోనా కారణంగా అన్నీ వాయిదా పడ్డాయి. ఈ సారి ముందుగానే సంక్రాంతికి సొంత ఊర్ల కు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నారు. అయితే, ఊహించని విధంగా ఏర్పడిన రద్దీతో ముందుగానే రైళ్లు - బస్సులు ఫుల్ అయిపోయాయి. ఇక, ఇదే ఇప్పుడు ప్రయివేటు ఆపరేటర్లకు కాసుల పండుగగా మారుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ స్పెషల్ సర్వీసులతో స్పెషల్ ఛార్జీలను వసూలు చేస్తోంది.

ప్రయివేటు ఆపరేటర్ల డబుల్ ఛార్జీలు

ప్రయివేటు ఆపరేటర్ల డబుల్ ఛార్జీలు

ఇదే అదునుగా భావించి ప్రయివేటు బస్‌ ట్రావెల్స్‌ ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ఆర్టీసీ ఛార్జీల కంటే రెండింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో వరుసగా పండుగులతో ఆఫీసులకు సెలవులు ఇచ్చారు.దీంతో..ఈ నెల 12వ తేదీ నుంచి ఒక్క సారిగా రద్దీ ఏర్పడనుంది.

దీనిని క్యాష్ చేసుకొనేందుకు ప్రయివేటు ఆపరేటర్లు పోటీ పడుతున్నారు. రైళ్లళ్లో ఖాళీలు లేకపోవటంతో..ప్రవేటు బస్సుల్లో రేట్లు ఆమాంతం పెంచేసారు. హైదరాబాద్ నుంచి ఏపీ నగరాలకు వెళ్లే బస్సులు..అదే విధంగా ఏపీలోని విజయవాడ నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లే సర్వీసుల్లో నూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

రైళ్లు - బస్సులు ఫుల్ కావటంతో

రైళ్లు - బస్సులు ఫుల్ కావటంతో

కొన్ని ట్రావెల్స్ నాన్‌ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌ రూ.900-1,200 వరకు, ఏసీ స్లీపర్‌ బస్సుల్లో రూ.1,300-1,600 వరకు ఉన్నాయి. కొన్ని ఏసీ బస్సుల్లో రూ.2 వేలు కూడా ఉంది. ఆర్టీసీ బస్సులో విజయవాడ నుంచి విశాఖకు సూపర్‌ లగ్జరీ (నాన్‌ఏసీ) రూ.504, వెన్నెల ఏసీ సీటర్‌ రూ.578, స్లీపర్‌ రూ.888గా ఉంది. కడప, తిరుపతి మార్గంలో వెళ్లే బస్సుల్లో సైతం ఆర్టీసీ కంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

ఏపీఎస్‌ ఆర్టీసీ రెగ్యులర్‌ బస్సులు కాకుండా, అదనంగా నడిపే సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం ఛార్జీ ఎక్కువగా తీసుకోనుంది. ప్రైవేటు ట్రావెల్స్‌లో రెగ్యులర్‌, స్పెషల్‌ బస్సులు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఛార్జీలు పెంచేశారు. రైళ్లు రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

రైళ్లల్లో రిగ్రెట్ ... ఆర్టీసీ స్పెషల్ ఛార్జీలు

రైళ్లల్లో రిగ్రెట్ ... ఆర్టీసీ స్పెషల్ ఛార్జీలు

టిక్కెట్ల రిజర్వేషన్ రిగ్రెట్ చూపిస్తున్నాయి. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లల్లో ఎక్కువ రద్దీ కనిపిస్తోంది. ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, విశాఖ, ప్రశాంతి తదితర ఎక్స్‌ప్రెస్‌ల్లోని స్లీపర్‌ క్లాస్‌ రిగ్రెట్‌ చూపుతోంది. విశాఖ- విజయవాడ మధ్య ఇంటర్‌సిటీగా నడిచే రత్నాచల్‌, గుంటూరు- విశాఖ మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కూడా సెకండ్‌ సీటింగ్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ 150-180 మధ్య ఉంది. విజయవాడ మీదుగా తిరుపతి నుంచి కేరళ..తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లల్లో టిక్కెట్లు దొరికే పరిస్థితి లేదు.

రిటర్న్ జర్నీలోనూ ఇదే పరిస్థితి

రిటర్న్ జర్నీలోనూ ఇదే పరిస్థితి

అయితే, పండుగకు వెళ్లటానికే కాదు.. తిరిగి వచ్చే సమయంలోనూ టిక్కెట్లకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండుగ సెలవులు ముగిసిన తరువాత సాధారణంగా 16 లేదా 17వ తేదీన ఎక్కువ మంది రిటర్న్ జర్నీలకు సిద్దం అవుతారు. ఆ రెండు రోజుల్లో రైళ్లల్లో ఇప్పటికే రిగ్రెట్ కనిపిస్తోంది. ఇదే అదనుగా భావించిన ప్రయివేటు ఆపరేటర్లు తమ రేట్లను ఇస్టానుసారం పెంచేస్తున్నారు. మరి వీరిని నియంత్రించేదెవరు. పండగు ఖర్చు కంటే..టిక్కెట్ల ఖర్చు ఎక్కువగా ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+