ఎమ్మెల్సీల జంపింగ్స్: కెసిఆర్‌కు పొన్నాల సూచన
న్యూఢిల్లీ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. వలసలను ప్రొత్సహించడం మానుకోవాలని ఆయన కెసిఆర్‌కు హితవు పలికారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
వలసలను ప్రోత్సహించడం వంటి చర్యలు తెరాసకు మంచిది కాదని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తెరాస పెట్టిన అంశాలపై సహకరిస్తామని చెప్పామని, అవి అమలు చేయలేని పక్షంలో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పామని పొన్నాల తెలిపారు. అంతేకానీ రాజకీయంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం తగదని హితవుపలికారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెరాసలో చేరడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య తప్పు పట్టారు. తెరాస పార్టీ ఒక సునామీ లాంటిదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని అంటూ అప్పుడు వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఏ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉండదని, అంచేత నేతలు పార్టీ మారడం సరైన పద్ధతి కాదని ఆయన మీడియాతో అన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు అయి ఉండి ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. వారు తెరాసలోకి ఎందుకు వెళుతున్నారో కారణం తెలియదు గానీ దీన్ని తాను సమర్ధించనని ఎల్లయ్య అన్నారు.












Click it and Unblock the Notifications