లెక్కలు చెప్పు: పవన్‌కు పొన్నం, అన్ని చెప్తారు: హరీష్

కరీంనగర్/మెదక్: మోడీకి జై కొట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. నీతి వ్యాఖ్యలు చెబుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంత పారితోషికం తీసుకుంటున్నారో చెప్పాలన్నారు.

అందులో బ్లాక్ మనీ ఎంత, వైట్ మనీ ఎంతో చెప్పాలన్నారు. అలాగే ప్రభుత్వానికి ఎంత టాక్స్ చెల్లిస్తున్నారన్నారు. సినిమాల్లో నటనలా నిజ జీవితం ఉండదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెసు పార్టీని విమర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరిటాల రవీంద్ర గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమయిందని ప్రశ్నించారు.

Ponnam asks Pawan Kalyan about his remuneration

కెసిఆర్ అన్నీ మాట్లాడతారు: హరీష్ రావు

ఎల్లుండి జోగిపేట సభలో తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని విషయాలు మాట్లాడుతారని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్ జిల్లాలో అన్నారు. కెసిఆర్‌ను విమర్శఇంచాలనే పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ కంకణం కట్టుకున్నారన్నారు. తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెచ్చామన్నారు.

కాంగ్రెసు భయపడుతోంది: ప్రకాశ్ జవదేకర్

నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అందుకే మోడీపై అసత్య ప్రచారానికి ఆ పార్టీ దిగుతోందని భారతీయ జనతాపార్టీ అదికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. న్యూఢిల్లీలో జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీలాగే వ్యవహరిస్తోందని, చౌకబారు విమర్శలకు దిగుతోందని అన్నారు. మోడీపై మసూద్ చేసిన విమర్శలు కాంగ్రెస్ అసలు రూపానికి నిదర్శనమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+