వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు-విద్యాహక్కు చట్టంఅమలుకు సర్కార్ రెడీ..

|
Google Oneindia TeluguNews

ఏపీలోని ఓవైపు ప్రభుత్వ విద్యాసంస్ధల్ని బలోపేతం చేస్తూ విద్యాసంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్.. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్ధల్లోనూ విద్యార్దుల్ని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం విద్యాహక్కు చట్టాన్ని అమలుచేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై పేద విద్యార్ధుల కోసం ప్రైవేటు విద్యాసంస్ధలు 25 శాతం సీట్లను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.

ఏపీలోని విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేదలకు రిజర్వ్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు గతంలో ఇచ్చిన అఫిడవిట్లో హామీ ఇచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలుచేస్తామని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యాహక్కు చట్టం అమలు కోసం ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పేద విద్యార్ధులకు ప్రైవేటు స్కూళ్లు 25 శాతం సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోనుంది.
ఈ మేరకు తాజా మార్పులతో గెజిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రతి ప్రైవేటు స్కూలు ప్రవేశాల సమయంలో ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాన్ని తెలియ జేయడంతో పాటు గత మూడేళ్ల సగటుకు తగ్గకుండా సీట్లు ఉంచాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే పాఠశాల విద్యాశాఖ రూపొందించే పోర్టల్లో విద్యార్థులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు.

poor students to get 25 percent free seats in ap private schools-jagan regime orders

కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద వర్గానికి చెందిన విద్యార్థులకు సీట్లను కేటాయించాలని హైకోర్టు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు నిబంధనలను అమల్లోకి తీసుకురాలేమని, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి సీట్ల కేటాయింపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు కూడా అవకాశం లభించబోతోంది.

మరోవైపు విద్యార్ధుల్ని బడులకు రప్పించేందుకు అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాల్ని అమలుచేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే వాటిని ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేటులోనూ అమలు చేస్తోంది. వీటిని ప్రైవేటు స్కూళ్లలో తీసేస్తారంటూ ప్రచారం జరిగినా వాటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పుడు పేద విద్యార్ధులకు ప్రైవేటు స్కూళ్లలో సీట్లను కూడా రిజర్వ్ చేయడం ద్వారా నాణ్యమైన విద్య అందే అవకాశం లభిస్తుంది.

English summary
ap govt has made key change in right to education act as poor students to get 25 percent seats in private schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X