కనిపించే మూడు సింహాలు మోదీ, అమిత్ షా, నడ్డా, కనిపించని నాలుగో సింహం మా రెడ్డి గారు!
భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే ఐదు ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు తలరాతలు ఆరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయామని, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, రాజంపేట లోక్ సభ నియోజక వర్గం పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లోకి వచ్చిందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజంపేట లోక్ సభ నియోజక వర్గంలోని పెద్దమండ్యం తదితర ప్రాంతాల్లో మాజీ సీఎం, ఆ నియోజక వర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ నటుడు సాయికుమార్, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, తంబళపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు సాయికుమార్ మాట్లాడుతూ కనిపించే మూడు సింహాలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అయితే కనిపించని నాలుగో సింహం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సినిమా డైలాగులతో అందరిని ఆకట్టుకున్నారు. సీఎంగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని మీరు ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం అవుతారని, రాజంపేటలో ఎన్నడూ జరగని అనేక మంచి పనులు చేస్తారని, అలా చేస్తే ఇక్కడి ప్రజలకే లాభం అని నటుడు సాయికుమార్ అన్నారు.
అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజంపేట లోక్ సభ నియోజక వర్గంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగే దోపిడీలు, దౌర్జన్యాలకు, వైసీపీ నాయకుల పాపాలకు పెద్దిరెడ్డి కారణం అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు అమాయకుల భూములు లాక్కొంటున్నారని, ఎదురు తిరుగుతున్న ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, రానురాను వారి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఇక్కడి సమస్యలు ప్రశ్నించిన నిండు గర్బిణిపై నిర్దాక్షణ్యంగా దాడులు చేసిన వైసీపీ నాయకులకు మీరో మరోసారి ఓటు వేస్తారో ?, లేక ఓటు వెయ్యకుండా వారికి తగినబుద్ది చెబుతారో అంతా మీ చేతుల్లోనే ఉందని, ఓటు వేసే ముందు వారి అరాచకాలు గుర్తు చేసుకోవాలని, లేదంటే మరో ఐదు సంవత్సరాలు వారి అరాచకాలకు మీరు బలి కావలసి వస్తోందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
పెద్దిరెడ్డి అరాచకాలకు భయపడకూడదని, ప్రతిఒక్కరూ ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వెయ్యాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు మనవి చేశారు. పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళపల్లె, రాయచోటి, పలమనేరు, రాజంపేట తదితర ప్రాంతాల్లో పెద్దిరెడ్డి అరాచకాలకు అంతేలేకుండా పోతోందని, వారిని దౌర్జన్యాలు కట్టడి చెయ్యాలంటే రాంజపేట, తంబళపల్లె, పుంగనూరు, పీలేరు, మదనపల్లెలో వారికి వ్యతిరేకంగా ఓటు వేసి తగిన గుణపాఠం చెప్పాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications