థూ: నీ భార్య, చెల్లెల్ని నేనూ పచ్చి బూతులు తిడతా: చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు: పవన్‌పై పోసాని ఫైర్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించిన మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వేలాది మెసేజీలతో వస్తోన్నాయంటూ ప్రముఖ నటుడు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణ మురళి మరోసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ప్రెస్‌మీట్ ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మళ్లీ ఆయన మీడియా ముందుకొచ్చారు.

పచ్చి బూతులు తిడుతూ..
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి పచ్చి బూతులు, అమ్మనా బూతులు తిడుతూ తనకు వేలాది మెసేజీలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌కు తాను చాలా రెస్పెక్ట్ ఇచ్చానని చెప్పారు. షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ తనకు ఫోన్ చేసి, మేం పిచ్చోళ్లమా అని బెదిరించిన సందర్భాలు ఉన్నాయని పోసాని అన్నారు.

సపరెట్‌గా సైకో ఫ్యాన్స్..
పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే- అతని అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారో.. ఓ వైఎస్ జగన్ అభిమానిగా తాను కూడా అదే రకంగా స్పందించానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పవన్ కల్యాణ్ తుకడా చేస్తానని హెచ్చిరించారని, అప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికి వెళ్లి ధర్నా చేశారా? లేక ఆయనకు బెదిరింపు మెసేజీలు పంపించారా అని నిలదీశారు. పవన్ కల్యాణ్‌కు తన మీద పీకల్దాకా కోపం ఉందని అన్నారు. తాను జగన్‌ను ప్రేమిస్తానని, పార్టీ పెట్టకముందు నుంచే అభిమానిస్తానని అన్నారు.

పవన్ తన ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టుకోవాలి..
పవన్ కల్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని చెప్పారు. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని అన్నారు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి.. తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తానూ కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.

చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు..
చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు అవినీతి గురించి మాట్లాడితే- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఆయన కుమార్తెపై వివాదాస్పద కామెంట్స్ చేశారని పోసాని కృష్ణ మురళి అన్నారు. రాజకీయాలకు, కుటుంబ సభ్యులకు సంబంధం ఏమిటని తన ఎదురుగా చిరంజీవి.. కన్నీళ్లు పెట్టుకున్నారని, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. భోజనం చేయకుండా బాధపడ్డారని పోసాని అన్నారు.

రాజకీయాలు, కుటుంబానికి ఏం సంబంధం..
రాజకీయాలకు, కుటుంబానికి ఏం సంబంధం ఉందని చిరంజీవి బాధపడ్డారని అన్నారు. మంత్రి కురసాల కన్నబాబు దీనికి సాక్షి అని పోసాని అన్నారు. కురసాల కన్నబాబు.. చిరంజీవికి, తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. తమ ఇద్దరి ఎదురుగా చిరంజీవి ఆవేదన చెందడాన్ని తాను తట్టుకోలేకపోయానని అన్నారు. నేరుగా కేశినేని ఇంటికి వెళ్లి- ఆయనతో మాట్లాడానని చెప్పారు. కేశినేని నానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, వారిని ఎవరైనా, ఏమైనా అంటే బాధపడరా? అని నిలదీశానని చెప్పారు. దీనితో కేశినేని నాని పశ్చాత్తాప పడ్డారని అన్నారు.

రక్తకన్నీరు తప్పదు..
పవన్ కల్యాణ్‌కు కూడా ఒక కుమార్తె ఉందని, రేప్పొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని, పవన్ కల్యాణ్‌కు రక్త కన్నీరు తప్పదని జోస్యం చెప్పారు. నీ ఇంట్లో ఉండే వాళ్లే ఆడవాళ్లా? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు. తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ కల్యాణ్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే.. తాను కూడా పవన్ కల్యాణ్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని హెచ్చరించారు.

బాధ చెప్పుకోకూడదా?
పోసాని మాట్లాడుతున్న సమయంలో ఓ విలేకరి అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయన మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన భార్యా, బిడ్డలను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బజారుకు ఈడ్చేలా వ్యాఖ్యలు చేస్తోన్న విషయాన్ని తాను బయటికి చెప్పుకోవడానికి వచ్చానని పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన మీద, తన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో.. చెప్పుకోవడం వ్యక్తిగతం కాదని అన్నారు.

ఓడిపోయాననే అక్కసుతో..
వైఎస్ జగన్ తనను రెండు చోట్లా ఓడగొట్టాడనే అక్కసు, ఆగ్రహం పవన్ కల్యాణ్‌కు ఉందని పోసాని అన్నారు. ఆ కడుపుమంటతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని చెప్పారు. రాజకీయాల్లో పరిణతి, పరిపక్వత అవసరం అని, అవి పవన్ కల్యాణ్ అనే సైకోలో లేవని అన్నారు. సైకో ఫ్యాన్స్ పెంచి పోషిస్తోన్న పవన్ కల్యాణ్.. అతి పెద్ద సైకో అని ధ్వజమెత్తారు. చిరంజీవి ఏరోజైనా నోరు జారి మాట్లాడలేదని, ఆయన అభిమానులు కూడా అంతేనని అన్నారు.

ప్రెస్‌క్లబ్ వద్ద ఉద్రిక్తత..
పోసాని కృష్ణ మురళి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తోన్న విషయం తెలుసుకున్న కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. ఆయను అంతు చూస్తామంటూ హెచ్చరించారు. అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఆందోళన చేస్తోన్న ఫ్యాన్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనితో ప్రెస్‌క్లబ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి దాడులు చోటు చేసుకోకుండా పోలీసులు మోహరించారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications