కమ్మ ఆడపడుచుల పైన నీచంగానా? వైసీపీ నాశనానికే పృథ్వీ లాంటి వాళ్లు పుట్టారు.. పోసాని ఫైర్
Recommended Video
ఎస్వీబీసీ ఛైర్మన్..సినీ నటుడు పృథ్వీరాజ్ అమరావతి ప్రాంత నిరసనలు..రైతుల గురించి చేసిన వ్యాఖ్యల పైన పోసాని కృష్ణ మురళి తీవ్రంగా స్పందించారు. పృథ్వీరాజ్ వెంటనే రాజధాని రైతులకు బేష రతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పృథ్వీరాజ్ ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులని అన్నారో వివరణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబు వల్ల కమ్మవాళ్లు బతకడం లేదని వ్యాఖ్యానించారు . వాళ్లు పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారంటూ చెప్పుకొచ్చారు. జగన్‌ను, ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే పృథ్వీలాంటి వాళ్లు పుట్టారంటై మండిపడ్డారు. పృథ్వీరాజ్ ప్రభుత్వం తరఫునే మాట్లాడారని చెబితే... నా నిర్ణయం నేను తీసుకుంటానంటూ హెచ్చరించారు.

కమ్మ రైతులనా..కమ్మ ఆడపడుచులనా..
కొద్ది రోజుల క్రితం సినీ పరిశ్రమ మద్దతు విషయంలో పృథ్వీరాజ్ వ్యాఖ్యలపైన తీవ్రంగా రియాక్ట్ అయిన పోసాని..ఇప్పుడు అదే పృథ్వీరాజ్ అమరావతి రైతుల గురించి చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు. అసలు పృథ్వీరాజ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారో చెప్పాలని నిలదీసారు. పృథ్వీరాజ్ ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులని అన్నారో చెప్పాలన్నారు.

కమ్మ ఆడపడుచులను ఉద్దేశించి
పృథ్వీరాజ్ ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులని అన్నారో చెప్పాలన్నారు. కమ్మ రైతులు.. కమ్మ ఆడపడుచులను ఉద్దేశించి అన్నారా అని ప్రశ్నించారు. లేక, మొత్తం రాజధాని రైతులను అన్నారా అంటూ నిలదీసారు. ఎన్టీఆర్, చంద్రబాబు వల్ల కమ్మవాళ్లు బతకడంలేదుంటూ పోసాని వ్యాఖ్యానించారు. వాళ్లు పొలం పనులు చేసు కుంటూ గౌరవంగా బతుకుతున్నారని వివరించారు. వాళ్లను పృథ్వీ రోడ్డుమీదికి ఈడ్చారని ఆరోపించారు.

రైతులది త్యాగం కాదా..
రైతులు బురదలోనే ఉండాలంటూ పృథ్వీ చేసిన కామెంట్లకు పోసాని గట్టిగా బదులిచ్చారు.పెయిడ్ ఆర్టిస్టులన్నారు... అమరావతిలో 3 పంటలు పండుతాయిని..వాళ్ల పిల్లలను చదివించుకున్నారని చెబుతూ... కొందరు విదేశాలకూ పంపించారని వివరించారు. రైతులకు ఖరీదైన దుస్తులు ఉండవా.. బంగారు గాజులు వేసుకోరా.. రైతులు ప్యాంటు చొక్కాలు వేసుకోరా.. చేతిలో సెల్‌ఫోన్లు ఉండవా..అని ప్రశ్నలు సంధించారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లకు కూడా సెల్‌ఫోన్లు ఉన్నాయన్నారు.

పెయిడ్ ఆర్టిస్టులంటావా.. సిగ్గు పడాలి
తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని.. రాష్ట్రమూ బాగుపడుతుందని ప్రేమతో.. అభిమానంతో 33వేల ఎకరాలు ఇచ్చారని... అది త్యాగం కాదా అని పోసాని ప్రశ్నించారు.అలాంటి వారిని పెయిడ్ ఆర్టిస్టులంటావా.. సిగ్గు పడాలి పృథ్వీ అంటూ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీపై పోసాని మండిపడ్డారు.

అదే చెబితే..నా నిర్ణయం నాదే..
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కు తాను పదేళ్ల నుండి విధేయుడగా ఉన్నానని..అప్పుడు వీళ్లెవరూ లేరని చెప్పుకొచ్చారు. జగన్ ఎప్పుడూ, ఎవరిమీదా నోరు జారలేదన్నారు. జగన్‌ను, ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే పృథ్వీలాంటి వాళ్లు పుట్టారని వ్యాఖ్యానించారు. మీలాంటి వాళ్లు జగన్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇలా మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారుని.. వాళ్లందరివల్ల జగన్‌ను..వైసీపీని సోషల్ మీడియాలో తిడుతున్నారని చెప్పుకొచ్చారు.

సామాజిక స్పృహ ఉన్నవారితోనే
ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై సామాజిక స్పృహ,..గౌరవం ఉన్న వారితోనే ప్రభుత్వం మాట్లాడించాలని సూచించారు. ఒకవేళ... పృథ్వీరాజ్ ప్రభుత్వం తరఫునే మాట్లాడారని చెబితే... తన నిర్ణయం తాను తీసుకుంటానంటూ పోసాని స్పష్టం చేశారు. దీంతో..ఇప్పుడు పోసాని వ్యాఖ్యల మీద పార్టీలో..ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications