గాంధీలో ఎబోలా?: హైదరాబాద్ టెక్కీకి అనుమానిత వైరస్??

హైదరాబాద్: శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనుమానిత వైరస్‌తో మహాత్మా గాంధీ ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా నైజీరియాలో పని చేసిన ఆయన ఇటీవలె హైదరాబాద్ వచ్చారు. ఇంట్లో ఉండగా తీవ్ర జ్వరం రావడంతో నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో గత నెల 24వ తేదీన చేరారు.

అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకున్నప్పటికీ నయం కాలేదు. దీంతో ఆయనకు స్వైన్ ఫ్లూ లేదా ఎబోలా లక్షణాలు ఉండవచ్చునని భావించి, అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు. రోగి రక్త నమూనాలను ఢిల్లీకి పంపించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Possible Ebola infected Nigerian being tested at Hyderabad's Gandhi Hospital

ఎబోలా నోడల్‌ కేంద్రం వైద్యులు రోగి రక్తనమూనాలను, ముక్కు స్రావాలను సేకరించి ఢిల్లీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. బాధితుడు 40 ఏళ్ల వ్యక్తి. నైజీరియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతను నవంబర్‌ 21న నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు.

అక్కడ నుంచి హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చేరుకున్నాక విపరీతంగా జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో 24వ తేదీన కేర్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో వైద్యులు అతణ్ని అడ్మిట్‌ చేసుకుని చికిత్స ప్రారంభించారు. అతడికి ఎబోలా సోకిందనే విషయాన్ని మాత్రం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+