ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలా ? ఆన్ లైన్ లో దరఖాస్తు ఇలా..!
ఏపీలో స్ధానిక సంస్ధలకు వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెలలో పరిషత్, పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున పోలింగ్ సిబ్బందిని నియమిస్తోంది. వీరంతా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆన్ లైన్ లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులకు అవకాశం కల్పిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇందుకోసం వెబ్ సైట్ లింక్ https://sec-ems.ap.gov.in/apsec/ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వెబ్ సైట్ లోనే పోస్టల్ బ్యాలెట్ కోసం పోలింగ్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముందుగా స్ధానిక సంస్ధల ఎన్నికల పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు https://sec-ems.ap.gov.in/apsec/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ వారు తమ మొబైల్ నంబర్‌తో పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారి మొబైల్ నంబరే యూజర్ నేమ్ గా ఉంటుంది. వీరు మొదటిసారి లాగిన్ కావడానికి డిఫాల్ట్ పాస్‌వర్డ్ Nomsec@2026 ను వాడాల్సి ఉంటుంది. మొదటి లాగిన్‌లోనే డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోస్టల్ బ్యాలెట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన సిబ్బంది అందరూ వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతోంది.














Click it and Unblock the Notifications
