వైసీపీ పిటిషన్ పై సుప్రీం కీలక నిర్ణయం..! ప్రత్యేక విచారణ..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, నామినేషన్లు వేయనీయకుండా అభ్యర్ధుల్ని అఢ్డుకుంటున్న తీరుపై వైఎస్సార్సీపీ (YSRCP) సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు నామినేషన్లు వేసేందుకు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో రేపు ప్రత్యేక విచారణ చేపట్టాలని నిర్ణయించింది.

రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!
రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!

సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ రెండు కేసుల విచారణ కోసం రేపు ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ జస్టిస్ వి.మోహనలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ రెండు కేసుల్ని విచారించబోతోంది. ఇందులో ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో హింస చెలరేగిందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన కేసుతో పాటు ఎక్సాలాజిక్ అవినీతి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె, అల్లుడు దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయి.

Supreme Court to Hear YSRCP s Plea tomorrow Seeking Relief Over AP Local Body Election Nominations
సుప్రీంకు వైఎస్సార్సీపీ- నామినేషన్ల గడువు పొడిగింపు, ఏకగ్రీవాలపై స్టే సహా ..!
సుప్రీంకు వైఎస్సార్సీపీ- నామినేషన్ల గడువు పొడిగింపు, ఏకగ్రీవాలపై స్టే సహా ..!

వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ లో స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించాలని కోరింది. ఈ మేరకు గడువు పొడిగించేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల సమయం ముగిసిందంటూ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరికాదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని చెప్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగితే ఎస్‌ఈసీ షెడ్యూల్‌ మార్చవచ్చని తెలిపాయి. ఇందుకు ఎన్నికల నిబంధనలు వీలు కల్పిస్తున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు పుంగనూరు, కడప, తిరుపతి ఘటనలపై సాక్ష్యాలను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు జత చేశాయి. నామినేషన్లు వేయలేకపోయినవారి పత్రాలను స్వీకరించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను వైసీపీ కోరుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏకగ్రీవాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+