స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలతో స్థానిక నాయకత్వం బలపడుతుందని, అందుకే స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టిస్తూ అద్భుతమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేసిన సీఎం దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు .
నాటి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అది అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు . ప్రధాని మోదీ నాయకత్వంలో తానూ , పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసిన చంద్రబాబు నాడు ఇచ్చిన హామీలను అమలు చేసేలా పాలన అందిస్తున్నామన్నారు. అనేక సవాళ్లున్నా చెప్పిన హామీలను నెరవేర్చాం... సంక్షేమాన్ని అందించామని చంద్రబాబు తెలిపారు.

ఎక్కువ మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం అని చెప్పారు సీఎం చంద్రబాబు.అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2.0 వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. డేటా సెంటర్ల నుంచి డిఫెన్స్ ప్రాజెక్టుల వరకూ అన్ని పరిశ్రమలను తెస్తున్నాం అని చెప్పారు. రెండున్నరేళ్లల్లో భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేలా కృషి చేశామని పేర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. రాయలసీమలో గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ పేరుతో ఉద్యాన పంటలను అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధికి నమూనాగా మారుస్తున్నాం అని పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెక్కల పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరందించాం.పోలవరాన్ని నాశనం చేశారు.. ఢయాఫ్రం వాల్‌ను గోదాట్లో ముంచేశారని విమర్శించారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో పోలవరం నిర్మాణం చేపడుతున్నామన్నారు. గోదావరి-కావేరి అనుసంధానమైతే దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి కోసం యుద్దాలు తప్పుతాయన్నారు.
2029 లోపు 36 ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తామన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, న్యూ టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభిస్తామన్నారు. విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లగా అభివృద్ధి చేస్తున్నాం అని చంద్రబాబు చెప్పారు. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం, స్వయం ఏపీ పేరుతో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ చేపడుతున్నాం అన్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాలను.. పట్టణాలను స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నాం అన్నారు. ఇళ్ల పైనే సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తున్నాం అన్నారు . విశాఖ, విజయవాడల్లో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చాం అన్నారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని పునర్నిర్మిస్తున్నాం అని చంద్రబాబు తమ పాలనలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చెప్పారు.
మూడు స్థాయిల్లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఆగదన్నారు. మరింత స్పీడుగా వెళ్లడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించండి... అభివృద్ధి సహకరించండి అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మెచ్చిన వాళ్లనే అభ్యర్థుల ఎంపిక చేసేలా కసరత్తు చేశామన్నారు. పార్టీకి సేవలందించిన వారిని... సోషల్ రీ-ఇంజనీరింగ్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేశాం. బీసీలు, యువత, మహిళకు ప్రాధాన్యమిచ్చాం... విద్యావంతులను అభ్యర్థులుగా నిలబెట్టాం అని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 63.6 శాతం మేర సీట్లు ఇచ్చాం. ఒక్క బీసీలకే 35 శాతానికి పైగా ఇచ్చాం అన్నారు. గంజాయి బ్యాచ్ వర్సెస్ విద్యావంతులు అన్నట్టుగా స్థానిక ఎన్నికల్లో పోటీ నెలకొంది. ప్రజలు అలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
