హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్ట్రీట్ ఫైట్‌: నబీల్ దేహంపై ఆరు చోట్ల గాయాలు, పథకమా? (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్ట్రీట్ ఫైట్‌లో నబీల్ మృతి యాధృచ్ఛికంగా జరిగిందా, పథకం ప్రకారం జరిగిందా అనేది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. నబీల్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికి తీసిన తర్వాత వైద్యులు దానికి పోస్టుమార్టం నిర్వ హించారు. ఫైట్‌లో ఎటువంటి బెట్టింగులూ జరగలేదని పోలీసులు చెబుతున్నారు.

నబీల్‌ మహ్మద్‌తో అవేజ్‌ మహ్మద్‌ ఫైట్‌ చేయడానికి ముందు అబూబకర్‌, సులేమాన్‌మహ్మద్‌తో ఫైట్‌ చేశాడు. ఈ రెండు ఫైట్స్‌నీ నబీల్‌ స్నేహితులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించలేదని తెలుస్తోంది. నబీల్‌తో జరిగిన ఫైట్‌ చిత్రాలను మాత్రం చిత్రీకరించారు. ఫైట్‌ మొదలుకావడానికి ముందు అవేజ్‌ మహ్మద్‌తో ఓ యువకుడు చెవిలో ఏదో విషయాన్ని చెప్పాడు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అవేజ్‌ చెవిలో ఆ యువకుడు ఏం చెప్పాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నచిన్న దెబ్బలు మాత్రమే కొట్టమని చెప్పామని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. వాస్తవానికి నబీల్‌ ముఖంపైనే బలంగా కొట్టమని చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు విధాలుగా విచారిస్తున్నారు.

ఉస్మానియాలో పోస్టుమార్టం

ఉస్మానియాలో పోస్టుమార్టం

పాతబస్తీ స్ర్టీట్‌ ఫైట్‌లో చనిపోయిన నబీల్‌ మృతదేహానికి సోమవారం నాడు ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

అక్కడే పోస్టుమార్టం

అక్కడే పోస్టుమార్టం

స్థానిక తహసిల్దార్‌ సమక్షంలో అంత్యక్రియలు జరిగిన బార్కాస్‌లోనే నబీల్‌ మృతదేహానికి శవపరీక్ష చేశారు. సమాధి నుంచి శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

ఆరు చోట్ల గాయాలు

ఆరు చోట్ల గాయాలు

పోస్టుమార్టం అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ నబీల్‌ శరరీంపై ఆరుచోట్ల బలమైన గాయాలైనట్లు గుర్తించామన్నారు.

నివేదిక ఇస్తాం

నివేదిక ఇస్తాం

సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం నివేదిక అందజేస్తామని వైద్యులు చెప్పారు

నబీల్ తండ్రి వాదన

నబీల్ తండ్రి వాదన

నబీల్ తండ్రిని హైదరాబాద్ దక్షిణ మండలం డిసిపి ప్రశ్నించారు.అయితే స్ర్టీట్‌గేమ్‌ ముసుగులో తన కొడుకును హత్య చేశారని నబీల్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

English summary
Body of Nabeel Mohammed, who died under suspicious circumstances, wasexhumed on Monday afternoon. A postmortem examination was being conducted bya team of doctors from Osmania Medical College Forensic Science Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X